BigTV English
Advertisement

Sunny leone: కాలిఫోర్నియా కారుచిచ్చులో దగ్ధమైన సన్నీలియోన్ ఇల్లు.. మొత్తం నష్టం ఎన్ని కోట్లంటే..?

Sunny leone: కాలిఫోర్నియా కారుచిచ్చులో దగ్ధమైన సన్నీలియోన్ ఇల్లు.. మొత్తం నష్టం ఎన్ని కోట్లంటే..?

Sunny leone.. ప్రముఖ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ (Sunny Leone)కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో తాజాగా కారు చిచ్చు సుమారు లక్షల కోట్ల రూపాయల నష్టానికి దారితీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో లోని కాలిఫోర్నియాలో కారు చిచ్చు మంటలు హాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఉండే అత్యంత ధనిక ప్రాంతాన్ని ఒక్కసారిగా దగ్ధం చేసింది. ఎటు చూసినా ఎగసిపడుతున్న మంటలు, హాలీవుడ్ నటులు ఉండే హై క్లాస్ ఇళ్ళు అన్నీ ఒక్కసారిగా మంటల్లో ఖాళీ బూడిద అయిపోయాయి. ధనికుల ఆస్తి అంతా కేవలం కొన్ని గంటల్లోనే అగ్గిపాలయ్యింది. ఎర్రని మంటల మీద నల్లని పొగతో ఆ ప్రాంతమంతా అత్యంత భయంకరంగా కనిపించింది.


కారుచిచ్చులో దగ్ధమైన హాలీవుడ్ ప్రాంతం..

కోట్లాది రూపాయల విలువచేసే కార్లు, ఫర్నిచర్, వస్తువులు ఇలా ఒక్కటేమిటి హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ మంటల్లో కాలిపోయిన ఇళ్లల్లో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఇల్లు కూడా ఉంది. ఆ మాటకొస్తే ట్రంప్ కొడుకు నివాసం, బ్రిటన్ యువరాజు హ్యారీ ఇల్లు, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు తోపాటు ప్రముఖ బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone)ఇల్లు కూడా ఈ మంటల్లో కాలిపోయింది. ముఖ్యంగా ఎంతో మంది హాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల ఇల్లు మొత్తం ఈ మంటల్లో కాలిపోయాయి. ఈ విషయం తెలిసి సన్నీలియోన్ ప్రియాంక చోప్రా అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు


మొత్తం నష్టం రూ.12 లక్షల కోట్ల పై మాటే..

ఇకపోతే హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే ఈ ప్రాంతంలో.. జరిగిన ఈ విధ్వంసం ఖరీదు అక్షరాల రూ.12 లక్షల కోట్ల పై మాటే. దీన్ని బట్టి చూస్తే నష్టం ఏమేరా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న హాలీవుడ్ ప్రాంతంలో దాదాపు 20వేల అత్యంత ఖరీదైన ఇళ్ళు దగ్ధం అయిపోయాయి. మరో చోట పదివేల ఇళ్లు దగ్ధం అయ్యాయి. ప్రపంచాన్ని శాసించే అమెరికా ఈ మంటలను మాత్రం ఆపలేకపోయింది. ముఖ్యంగా బీచ్ పక్కన ఉండే ఇళ్లు కూడా కాలిపోయాయి అంటే ఈ వైల్డ్ ఫైర్ ఏ రేంజ్ లో విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు..

మంటలు అదుపు చేయకపోవడానికి కారణం అదేనా..?

ముఖ్యంగా ఇక్కడి మంటలను అదుపు చేయలేకపోవడానికి కారణం ఫసిఫిక్ పాలిసాడ్స్ లోని శాంటాయ్నేజ్ రిజర్వాయర్ లో నీటినిలువ తగ్గడమే.. గతంలో ఎన్నో కారు చిచ్చులు జరిగినా.. ఇదే రిజర్వాయర్ అడ్డుకుంది. అయితే ఇటీవల పెద్దగా వర్షాలు లేకపోవడం వల్ల ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీనిని మూసివేశారు. ఇకపోతే ఇలాంటి అత్యంత అవసర పరిస్థితి ఏర్పడినా.. ఈ నీటి నిలువలు అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారడంతోనే ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారు.

ఇప్పటికైనా ప్రపంచ పెద్దలు జాగ్రత్త పడతారా..?

ముఖ్యంగా కాలిఫోర్నియాలోని పెరిగిన స్మార్ట్ సిటీల ఏర్పాటు, చెట్ల నరికివేతకు కారణమవుతోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి 2030 ఎజాండాలో భాగంగా స్మార్ట్ సిటీల పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా దీని కారణంగానే కాలిఫోర్నియాలో భూ కబ్జాలు, చెట్ల నరికివేత బాగా పెరిగిపోయింది. పచ్చదనం తగ్గిపోవడం వల్లే వేడి విపరీతం అయింది. ఫలితంగా కారు చిచ్చు అధికం అవుతోంది. మరి ఇప్పటికైనా ప్రపంచ పెద్దలు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×