BigTV English

MLA Kaushik Reddy: BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు

MLA Kaushik Reddy: BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు

MLA Kaushik Reddy: నిన్న కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ఈ గొడవకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.


జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరుగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read: YCP in Nellore: ఏపీలో ఆ జిల్లాకు ఏమైంది.. ఒకప్పుడు వైసీపీ కంచుకోట.. ఇప్పుడేమో..?


సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారాని ఆర్డీవో మహేశ్వర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేవారు. అలాగే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన పిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వేరు వేరుగా.. పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.  అయితే.. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్‎ మధ్య జరిగిన వాగ్వాదంపై కాంగ్రెస్ సేతలు ఫైరవుతున్నారు. పేదవానికి మేలు జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. పోలీసులను అదుపు చేసిన ఆగకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×