Tollywood Hero..తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది దర్శక నిర్మాతల, హీరోల వారసులే ఇండస్ట్రీకి రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వాళ్లకు పెద్దయ్యాక హీరోగా అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అతి కొద్దిమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మాత్రమే ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తారు. అలాంటి వారిలో తేజా సజ్జ (Teja Sajja) ఒకరు.. తేజా సజ్జ చిన్నతనంలో ఎంతోమంది స్టార్ హీరోలకు చిన్నప్పటి పాత్రల్లో నటించారు. అలా ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి(Chiranjeevi ) చిన్నప్పటి పాత్రలో ఇంద్రసేనారెడ్డిగా కనిపించారు. అంతేకాకుండా ‘చూడాలని ఉంది’, ‘రాజకుమారుడు’, ‘కలిసుందాం రా’, ‘వసంతం’, ‘యువరాజు’, ‘గంగోత్రి’, ‘చత్రపతి’, ‘ఠాగూర్’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోల చిన్నప్పటి పాత్రల్లో అలాగే హీరోలతో కలిసి చేసే పాత్రల్లో నటించారు.
చైల్డ్ ఆర్టిస్టు నుండి పాన్ ఇండియా స్టార్ వరకు..
అలా ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజా సజ్జ పెద్దయ్యాక మొట్టమొదటిసారి సమంత (Samantha ) నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.ఆ తర్వాత ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమాతో ఫస్ట్ టైం హీరోగా నటించారు. అలా వీరి కాంబోలో వచ్చిన జాంబిరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తేజా సజ్జతో పాటు ప్రశాంత్ వర్మకి కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత ఇష్క్, అద్భుతం, హనుమాన్ వంటి సినిమాల్లో నటించారు. ఇక వీటన్నింటిలో తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన వీరంగం అంతా ఇంతా కాదు. రూ.50 కోట్ల బడ్జెట్ కూడా పెట్టని ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.296 కోట్ల కలెక్షన్స్ వచ్చి, ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలా చిన్న హీరో కాస్త పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
ALSO READ : Tollywood: ప్రస్తుతం ఈ ముగ్గురిదే హవా.. ఏలేస్తున్నారుగా..?
మిరాయ్ మూవీ కోసం తేజ భారీ డిమాండ్..
అయితే అలాంటి తేజ సజ్జ మొదట నటించే రెండు, మూడు సినిమాలకు లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ హనుమాన్ మూవీకి మాత్రం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక హనుమాన్ మూవీతో సంచలనం సృష్టించిన తేజ సజ్జ తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఈయన హీరోగా రాబోతున్న ‘మిరాయ్’ మూవీకి ఏకంగా రూ.8 కోట్ల నుండీ రూ.10 కోట్ల వరకూ పారితోషికాన్ని అందుకున్నట్టు సమాచారం.అంతేకాదు మిరాయ్ మూవీ హిట్ అయితే గనుక తేజా సజ్జ క్రేజ్ ఎక్కడికో వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కాస్త క్రేజ్ వచ్చిందంటే అమాంతం డిమాండ్లు చేస్తూ పారితోషకం పెంచేస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు హీరోయిన్స్ మాత్రమే కాదు మేము కూడా అంటూ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు సొంతం చేసుకొని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న తేజ కూడా భారీగా డిమాండ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఇదే కంటిన్యూ అయితే త్వరలో రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలోకి తేజ చేరిపోతారు అనడంలో సందేహం లేదు..