BigTV English

Suriya 45: తనే డైరెక్టర్, తనే విలన్.. సూర్య సినిమా కోసం భారీ రిస్క్..

Suriya 45: తనే డైరెక్టర్, తనే విలన్.. సూర్య సినిమా కోసం భారీ రిస్క్..

Suriya 45: సినీ పరిశ్రమలో చాలామంది మల్టీ టాలెంటెడ్ నటీనటులు, దర్శకుడు ఉన్నారు. ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేస్తూనే ఆఫ్ స్క్రీన్ మరెన్నో విభాగాలను హ్యాండిల్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు సూర్య సినిమా కోసం అలాంటి రిస్కే తీసుకుంటున్నాడు దర్శకుడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’తో సూర్యకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిశాస్టర్‌గా నిలిచింది. కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిశాస్టర్ అయ్యింది ‘కంగువా’. అయినా కూడా దర్శకుల విషయంలో ప్రయోగాలు చేయడం ఆపలేదు సూర్య. తన 45వ చిత్రం కోసం కూడా అదే చేస్తున్నాడు.


విలన్‌గా అవసరమా.?

‘సూర్య 45’ను ఆర్జే బాలాజీ (RJ Balaji) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు స్టార్ హీరోను డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ బాలాజీకి లేదు. అయినా సరే తన 45వ చిత్రం కోసం తనకు ఛాన్స్ ఇచ్చాడు సూర్య. అయితే ఈ సినిమా కోసం ఆర్జే బాలాజీ పెద్ద రిస్కే చేస్తున్నాడు. తనే ఈ మూవీని డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా తనే ఇందులో విలన్‌గా కూడా కనిపించనున్నాడని గత కొన్నాళ్లుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్యకు ఒక సరైన హిట్ కావాలి. అలాంటి సమయంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మూవీ చేయడం మాత్రమే కాకుండా తనే విలన్ అంటే ఇది కొంచెం రిస్క్ అని తన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో సూర్య బిజీ అయిపోయాడు.


Also Read: ఆస్కార్ బరిలో ‘కంగువా’.. అసలు ఇదెలా సాధ్యం.?

ఓకే చెప్పాడు

ప్రస్తుతం ‘సూర్య 45’ (Suriya 45) షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం చెన్నైలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. జనవరి చివర్లో మళ్లీ ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ అవ్వనుందని సమాచారం. ఈ సినిమాలో సూర్య.. ఒక లాయర్ పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఆర్జే బాలాజీ కూడా ఇందులో ఒక లాయర్‌గానే కనిపించనున్నాడని తెలుస్తోంది. ఆర్జే బాలాజీ ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో పాటు ఇందులో విలన్‌గా నటిస్తానని నిర్ణయించుకున్నప్పుడు సూర్యనే స్వయంగా ఈ నిర్ణయానికి ఓకే చెప్పాడని కోలీవుడ్ సమాచారం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయినా కూడా ఇప్పటికీ దీనికి సంబంధించిన అప్డేట్ ఏమీ బయటికి రాలేదు.

చాలా కష్టపడ్డాడు

గత కొన్నాళ్లుగా కోలీవుడ్ పరిస్థితి ఏమీ బాలేదు. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న తమిళ సినిమాలు అన్నీ భారీ డిశాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే కోలీవుడ్ మార్కెట్‌ను అంతంత మాత్రంగా కాపాడుతున్నాయి. అలా హై బడ్జెట్‌తో వచ్చి డిశాస్టర్ అయిన వాటిలో సూర్య నటించిన ‘కంగువా’ కూడా ఒకటి. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం, హిట్ చేయడం కోసం సూర్య (Suriya) చాలానే కష్టపడ్డాడు. కానీ ఎన్ని చేసినా కూడా ‘కంగువా’ హిట్ అవ్వలేదు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×