Harbhajan Singh: ఐదు టెస్ట్ ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటన చేసిన భారత జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల ఈ సిరీస్ ని ఆస్ట్రేలియా 3-1 తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో ఓటమితో డబ్ల్యూటీసి 2025 ఫైనల్ బెర్త్ ని కూడా కోల్పోయింది భారత జట్టు. ఈ సిరీస్ మాత్రమే కాదు గత కొంతకాలంగా భారత జట్టు తీవ్రంగా విఫలమౌతోంది.
Also Read: Temba Bavuma: ఉన్నది 3 ఫీట్లే.. కానీ పాకిస్థాన్ ను వణికించాడు.. చరిత్ర సృష్టించాడు!
ముఖ్యంగా చెప్పాలంటే భారత హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి జట్టు కీలక సిరీస్ లలో పరాభవాన్ని మూటగట్టుకుంటుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఓటమి , ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్, ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఇలా వరుసగా విఫలం చెందడంతో జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో భారత జట్టు ఆట తీరు గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించారు. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఉన్నంతవరకు అంతా బాగానే ఉందని.. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఏమైందని ప్రశ్నించాడు. ఈ ఆరు నెలల కాలంగా..? గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాతే భారత జట్టు విఫలం అవుతుందని పేర్కొన్నారు. ” రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నంతకాలం అంతా సజావుగానే సాగింది. టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ ని కైవసం చేసుకుంది.
టి-20 ప్రపంచ కప్ 2024 ని కూడా గెలిచింది. కానీ ఉన్నపళంగా టీమిండియాకు ఏమైంది..? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ కి అతిపెద్ద ప్రతికూలత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల ప్రదర్శన. వారు జట్టు నుంచి నిష్క్రమించాలనే పిలుపు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ సూపర్ స్టార్ సంస్కృతికి ముగింపు పలకాల్సి ఉంది.
ప్రతి ఆటగాడికి పాపులారిటీ ఉంటుంది. ఇలా చూసుకుంటూ పోతే కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే.. ఇలా భారత జట్టుకు చాలామంది మ్యాచ్ విన్నర్ లు ఉన్నారు. వీరిని కూడా జట్టు నుంచి తప్పుకోవాలని సెలెక్టర్లు చెప్పారు. సెలెక్టర్లు, బీసీసీఐ పట్టు సాధించాలి. సూపర్ స్టార్ వైఖరిని భారత్ వదిలేయాలి. అభిమన్యు ఈశ్వరన్ ని ఆస్ట్రేలియా టూర్ కి ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచ్ లోను అతడిని ఆడించలేదు. సర్పరాజ్ ఖాన్ పరిస్థితి కూడా ఇదే.
Also Read: Jasprit Bumrah – ICC Champions Trophy 2025: ఇంగ్లండ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?
ఇప్పటినుండి అయినా పేరున్న ఆటగాళ్లని కాకుండా.. బాగా ఆడే ప్లేయర్లని ఎంపిక చేయాలి. బుమ్రా లేకుంటే ఈ ట్రోఫీని ఆస్ట్రేలియా 5-0 తో గెలుపొందేది. అతడు లేకుంటే భారత్ పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. పాపులారిటీ ఉన్న ఆటగాళ్లని కాకుండా.. ప్రతిభ ఉన్న ఆటగాళ్లని సెలెక్ట్ చేయండి” అంటూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు.