BigTV English
Advertisement

Suriya: వయనాడ్ బాధితులకు సూర్య ఫ్యామిలీ రూ.50 లక్షల విరాళం

Suriya: వయనాడ్ బాధితులకు సూర్య ఫ్యామిలీ రూ.50 లక్షల విరాళం

wayanad landslide Tragedy: భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. వందల మంది ప్రాణాలు విడిచారు. మరికొంత మంది శిథిలాల కిందే సజీవ సమాది అయిపోయారు. ఇంకొందరు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 250 మందికి పైకి ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది.


భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చూరాల్‌మల, మండక్కై, మెప్పాడి, అట్టమాట, నూల్పూజ గ్రామాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, వైమానిక దలాలు రంగంలోకి దిగాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రజల్ని రక్షించారు. వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నా.. సాహసించి ఇప్పటికి చాలా మందిని రక్షించగలిగారు. ఈ విషాదకర సంఘటన సినీ సెలెబ్రిటీలను కబలించింది. ఈ విషాదం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇందులో భాగంగానే అసువులు బాసిన కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు.

Also Read: గొప్ప మనసు చాటుకున్న విక్రమ్.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం


రీసెంట్‌గా కోలీవుడ్ నటుడు విక్రమ్ కేరళ సీఎం సహాయనిధికి రూ.20 లక్షల విరాళంగా అందజేసి తన మంచి మనసును చాటుకున్నాడు. అలాగే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సైతం బాధితులకు అండగా నిలిచింది. అంతేకాకుండా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి దాదాపు రూ.5 కోట్లు విరాళంగా అందించారు.

ఇక ఇప్పుడు మరో సెలబ్రిటీ ఫ్యామిలీ ముందుకు కదిలింది. తాజాగా హీరో సూర్య, జ్యోతిక, కార్తీ తమ వంతు సాయం చేశారు. ఇందులో భాగంగానే కేరళ సీఎం సహాయనిధిక తమ వంతు సాయంగా రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఈ ప్రమాద ఘటన తన మనసును ఎంతో కలచి వేసిందని నటుడు సూర్య ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపాడు. దీంతో నటుడు సూర్య చేసిన ఈ సహాయానికి ఆయన అభిమానులతో పాటు ఇతరులు అభినందిస్తున్నారు.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×