Vishwak Sen at Kanguva Movie Pre-release Event: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే సినిమాతో దినేష్ నాయుడుగా పరిచయమైన విశ్వక్ ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో విశ్వక్సేన్ గా మారాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో కూడా టైటిల్స్ లో విశ్వక్సేన్ నేమ్ విశ్వక్సేన్ నాయుడు అని పడుతుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను కూడా చూపించాడు విశ్వక్. తను దర్శకత్వం వహించిన ఫలక్నామా దాస్ సినిమా మంచి హిట్ అయింది. దర్శకుడుగా కూడా ఆ సినిమాతో సక్సెస్ అయ్యాడు విశ్వక్.
ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు విశ్వక్. అయితే అందరూ హీరోలులా కాకుండా విశ్వక్ కూడా కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. రీసెంట్గా గామి అని ఒక ఎక్స్పరిమెంటల్ ఫిలిం కూడా చేశాడు విశ్వక్. ఆ సినిమా కోసం దాదాపు చాలా ఏళ్లు టైం కేటాయించాడు. ఆ సినిమాని చాలా వరకు రియల్ లొకేషన్స్ లో కూడా షూట్ చేశారు. ఇక ప్రస్తుతం లైలా అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఒకవైపు నటుడుగా మరోవైపు దర్శకుడుగా సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నాడు. ఇక విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి అనుకోకుండా ఏదో ఒక వివాదానికి కూడా గురి అవుతుంటాడు.
Also Read : Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూడొచ్చు అంటే.. ?
ఇక రీసెంట్ విశ్వక్సేన్ సూర్య నటిస్తున్న కంగువ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈవెంట్లో విశ్వక్ మాట్లాడుతూ చిన్నప్పుడు గజినీ సినిమా చూసి గుండు కొట్టించుకున్నాను అని చెప్పాడు. మామూలుగా ఇంట్లో వాళ్ళు తిరుపతికి తీసుకెళ్లి గుండు కొట్టిస్తా అంటే ఒప్పుకునే వాడిని కాదు, కానీ గజినీ సినిమా చూసి అలా కొట్టించుకున్నాను. ఇకపోతే గుండు లో కూడా హీరోలు ఇంత అందంగా ఉంటారు అని సూర్య సార్ నిరూపించారు. మామూలుగా ఏ హీరో అయినా ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేయడమే కష్టం అనుకునే తరుణంలో ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఆరు, నువ్వు నేను ప్రేమ, శివ పుత్రుడు వంటి సినిమాల పేర్లు చెప్పి సూర్య పైన తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచాడు విశ్వక్. ఇక సూర్య నటిస్తున్న కంగువ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. తెలుగులో బాహుబలి ఎంతటి విజయాన్ని సాధించిందో తమిళ్లో ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందని చాలా నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. అలానే ఈ సినిమాకి సంబంధించి దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయి అని నిర్మాత ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.