BigTV English

Tollywood: తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న యంగ్ హీరోయిన్స్.. వర్కౌట్ అయ్యేనా..?

Tollywood: తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న యంగ్ హీరోయిన్స్.. వర్కౌట్ అయ్యేనా..?

Tollywood:ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయి రేంజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు పలువురు సెలబ్రిటీలు టాలీవుడ్ లో సినిమాలు చేసి సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఒక్కసారి నటిస్తే చాలు ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది అనే రేంజ్ లో తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇతర భాషలలో పాపులారిటీ సంపాదించుకొని, టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైపోయారు ఇద్దరు యంగ్ హీరోయిన్స్. దీంతో వారిద్దరూ తెలుగులో ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి..? ఈ చిత్రాలు వారి కెరియర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి..? ఈ చిత్రాలతో వారి అదృష్టం పండుతుందా? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.


శ్రీనిధి శెట్టికి రెడ్ కార్పెట్ పరిచిన టాలీవుడ్..

అసలు విషయంలోకి వెళ్తే.. కేజిఎఫ్ సిరీస్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. 2016లో అందాల పోటీల్లో పాల్గొన్న ఈమె అక్కడ గెలుపును సొంతం చేసుకుంది. మోడల్ నుండి నటిగా మారిన ఈమె కే జి ఎఫ్ సీరీస్ తో భారీ హిట్స్ అందుకోవడమే కాదు మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తర్వాత విక్రమ్ తో చేసిన కోబ్రా డిజాస్టర్ కావడంతో కొత్త ప్రాజెక్టులు రావడానికి కాస్త సమయం పట్టింది. అయితే ఈసారి ఏకంగా టాలీవుడ్ ఈమెకు పెద్ద పీట వేసిందని చెప్పవచ్చు. ఏకంగా సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ అనే సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వస్తున్న ‘హిట్ 3’ లో కూడా అవకాశం సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. ఈ సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు ఈమెకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తాయో చూడాలి.


సుహాస్ తో జత కట్టిన మాళవిక మనోజ్..

ఇక ఈమెతోపాటు తెలుగులో తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవడానికి సిద్ధమైంది మాళవిక మనోజ్(Malavika Manoj). సపోర్టింగ్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల నుండి హీరోగా మారిన నటుడు సుహాస్ (Suhas) ప్రతి చిత్రంతో వేరియేషన్ చూపిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. తాజాగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది మాలీవుడ్ హీరోయిన్ మాళవిక మనోజ్. ‘ప్రకాశన్ పరాకట్టే’ సినిమాతో మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత తమిళ్ సినిమా ‘జో’ తో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమా తెలుగు వర్షన్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సుహాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్న ఇద్దరు యంగ్ హీరోయిన్స్ కి ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి.

Adah Sharma: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×