BigTV English

Nagavamsi Comments on Guntur Karam: వారి సినిమాలకు లాజిక్స్ తో పనేంటి.. సినిమాలు ఎలా తీయాలో నేర్పించాల్సినవసరం లేదు..!

Nagavamsi Comments on Guntur Karam: వారి సినిమాలకు లాజిక్స్ తో పనేంటి.. సినిమాలు ఎలా తీయాలో నేర్పించాల్సినవసరం లేదు..!
Suryadevara Nagavamsi
Suryadevara Nagavamsi

Suryadevara Nagavamsi Sensational Comments on Mahesh Babu’s Guntur Karam Movie: టాలీవుడ్ లో నిర్మాత సూర్యదేవర నాగవంశీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ప్రమోషన్స్ కు హీరో లేకపోయినా.. అంతకుమించి ప్రమోషన్స్ చేయగలిగే సత్తా ఉన్న నిర్మాత. సాధారణంగా ఏ ప్రమోషన్స్ లోనూ నిర్మాత కనిపించడు. కానీ, సితార ఎంటర్ టైన్మెంట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్స్ లో వచ్చే ప్రతి సినిమా ప్రమోషన్స్ లో నాగవంశీ పక్కాగా ఉంటాడు. ఇక ట్రోలర్స్ కు గట్టిగా సమాధానమివ్వాలి అంటే ఒక్క నాగవంశీ వలనే అవుతుంది. తన సినిమా కథ గురించి కానీ, హీరో గురించి కానీ, రివ్యూ, నెగటివ్ కామెంట్స్.. ఇలా ఏదైనా సరే దెబ్బకు దెబ్బ అన్నట్లు నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. మొన్నటికి మొన్న గుంటూరు కారం ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది కదా అని రిపోర్టర్ అంటే.. మేమేం డిజప్పాయింట్ అవ్వలేదు.. మీడియానే ఫీల్ అయ్యింది అని చురకవేసి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే సినిమాలో లాజిక్స్ లేవు.. మహేష్ బాబు ఏంటి.. ఆ సినిమా ఏంటి అన్న ట్రోలర్స్ కు మరోగట్టి దెబ్బ వేశాడు.


తాజాగా ఒక యూట్యూబ్ రివ్యూయర్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ అన్నింటికి సమాధానం చెప్పాడు. అసలు స్టార్ హీరో సినిమాలో లాజిక్స్ ఏవి.. ప్రభాస్ నటించిన సలార్ లో విలన్ లో ఒకడు.. ప్రభాస్ టాటూ చూసి భయపడతాడు. వాడి చేతిలో ఉన్న గన్ తో కాల్చేయొచ్చు.. ఇలాంటి లాజిక్స్ లేకుండా సినిమాలు ఎలా తీస్తారు. గుంటూరు కారంలో మహేష్ ప్రతిసారి గుంటూరు టూ హైదరాబాద్ తిరుగుతూ ఉంటాడు. ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు నాగవంశీ మాట్లాడుతూ.. ” అసలు స్టార్ హీరో సినిమాలకు లాజిక్స్ తో పనేంటి. సినిమాలో ప్రభాస్ హీరోయిజాన్ని చూపించారు. అక్కడ టాటూ చూడగానే ప్రభాస్ గుర్తుకురావాలి ఫ్యాన్స్ కు.. సినిమా చూసి చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ, కొంతమంది మాత్రమే విమర్శించారు. కమర్షియల్ సినిమాలకు లాజిక్స్ చూడకూడదు”.

Also Read: Gopichand: గోపీచంద్ మరో ప్రయత్నం.. చేతులు కలిపిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ


గుంటూరు కారం లో మహేష్  గుంటూరు  టూ హైదరాబాద్ వెళ్లడం లాజిక్ లేదని అంటారు. మూడు గంటల సినిమాలో మహేష్ ట్రావెల్, మధ్యలో ఆయన ఎక్కడ టీ తాగాడు లాంటివి చూపించాలా.. ?. కొందరైతే.. మాస్ సీన్స్ లేవని, ఇది త్రివిక్రమ్ కథ కాదని కూడా విమర్శించారు. అలాంటివారే ఓటిటీ లో వస్తే చూసారు. మహేష్ మిగతా సినిమాల్లో మాస్ సాంగ్స్ బాగా క్లిక్ అయ్యాయి అని.. ఇందులో కుర్చీ మడతపెట్టి సాంగ్ చేశాం. సాంగ్ చూడకుండా శ్రీలీల కు డ్రెస్ ఎలా వచ్చింది.. ? అక్కడకు శ్రీలీల ఎలా వచ్చింది.. ? అని విమర్శిస్తున్నారు. సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే. కమర్షియల్ గా సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి కానీ, లాజిక్స్ అడగకూడదు. ఇండస్ట్రీలోనే  గొప్ప పేరు ఉన్న  రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్.. ఆయనకు సినిమాలు ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. సినిమాపై ఎవరికైనా మాట్లాడే అర్హత ఉంది. కానీ, చిత్ర బృందంపై ఎవరుపడితే వాళ్లు మాట్లాడే అర్హత ఉండదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×