BigTV English

Gopichand – Srinu Vaitla Combo: గోపీచంద్ మరో ప్రయత్నం.. చేతులు కలిపిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ!

Gopichand – Srinu Vaitla Combo: గోపీచంద్ మరో ప్రయత్నం.. చేతులు కలిపిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ!
gopichandh 32
gopichandh 32

Hero Gopichand – Srinu Vaitla Combo: మ్యాచోస్టార్ గోపీచంద్‌కు హిట్టు పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగా వరుసపట్టి సినిమాలు తీస్తున్నా పెద్దగా ఫలితం దక్కడం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో మెప్పించాడు. కానీ హిట్టు టాక్ విని చాలా కాలమైపోయింది. అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.


అందులో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘భీమా’ మూవీ ఒకటి. ఈ మూవీతో గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న గోపిచంద్‌కు నిరాశే మిగిలింది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

రొటీన్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రోలింగ్స్ కూడా ఆ మధ్య వచ్చాయి. అయితే దాదాపు రూ.12 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తంగా రూ.7 కోట్ల వరకు వసూళ్లు సాధించి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌లో ఏప్రిల్ 5న ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.


Also Read: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ – అదితి రావు హైదరీ..!

ఇదిలా ఉంటే గోపీచంద్ తన కెరీర్‌లో మరో ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ సారి దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో దర్శకుడు శ్రీను వైట్ల గోపీచంద్‌ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి గోపీ మోహన్ స్క్రీన్ ప్లే రాశారు. అలాగే చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడికి సంబంధించి ఇది మొదటి నిర్మాణ సంస్థ. కాగా ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థతో మరో ప్రముఖ బడా నిర్మాణ సంస్థ భాగమైంది.

Also Read: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఈ పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా బాసు

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రం కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి వర్క్ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×