BigTV English

Adhir Chaudhary Offers to Varun Gandhi: వరుణ్‌ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్.. పార్టీలోకి ఆహ్వానం..!

Adhir Chaudhary Offers to Varun Gandhi: వరుణ్‌ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్.. పార్టీలోకి ఆహ్వానం..!
Varun Gandhi
Varun Gandhi

Congress Offer to Varun Gandhi to Join Party: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. యూపీలో పిలిభిత్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ వరుణ్ గాంధీకి దక్కలేదు. జితిన్ ప్రసాద్ ను పిలిభిత్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లోనే వరుణ్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.


ఇటీవల వరుణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రశ్నించారు. కొంతకాలంగా కాషాయ పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అలాగే గతేడాది రాహుల్ గాంధీతోనూ వరుణ్ భేటీ కావడం ఆసక్తిని రేపింది. ఆ సమయంలో కేదార్ నాథ్ లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. సమయం కోసం ఎదురు చూసిన బీజేపీ అధిష్టానం వరుణ్ కు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఇలా ఆయనకు చెక్ పెట్టింది.

Also Read: నామినేషన్ దాఖలు చేసిన రాధికా శరత్ కుమార్.. ఆస్తులు రూ. 50 కోట్లపైనే..


వరుణ్ గాంధీకి బీజేపీ దక్కకపోవడంతో కాంగ్రెస్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనపై అవినీతి ఆరోపణలు లేవని కాంగ్రెస్ లోక్ సభ పక్షా నేత అధీర్ రంజన్ చౌధరీ అన్నారు. కాంగ్రెస్ లోకి రాావాలని కోరారు. ఆయన పార్టీలో చేరితే ఆనందపడతామన్నారు. గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడం వల్లే వరుణ్ కు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని మండిపడ్డారు.

వరుణ్‌ తల్లి మేనకా గాంధీ బీజేపీలోనే ఉన్నారు. ఆమెకు ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ఎంపీ టిక్కెట్ ను బీజేపీ ఇచ్చింది. మరి తల్లి బీజేపీలో కొడుకు కాంగ్రెస్ లో ఉంటారా? ఇప్పుడు ఇదే ఆసక్తిగా మారింది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×