BigTV English

Taapsee Pannu: పెద్ద హీరోలకు అలాంటి హీరోయిన్సే కావాలి.. బాలీవుడ్ స్టార్లపై తాప్సీ కాంట్రవర్షియల్ కామెంట్స్

Taapsee Pannu: పెద్ద హీరోలకు అలాంటి హీరోయిన్సే కావాలి.. బాలీవుడ్ స్టార్లపై తాప్సీ కాంట్రవర్షియల్ కామెంట్స్

Taapsee Pannu: టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. వారిలో తాప్సీ ఒకరు. అయితే టాలీవుడ్‌ను విడిచి వెళ్లిన తర్వాత ఇక్కడ మేకర్స్ గురించి, స్టార్ హీరోల గురించి నటీమణులు కామెంట్ చేయడం కామన్ అయిపోయింది. కానీ తాప్సీ మాత్రం అలా కాదు. కాస్త డిఫరెంట్. తనకు నచ్చకపోతే సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరి గురించి ఒకే విధంగా మాట్లాడుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలపై మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పైనే ప్రత్యక్షంగా కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


అవే ఉదాహరణ

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే తాప్సీ క్రేజ్ పెరిగింది. ఒకవైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తనకు యాక్టింగ్‌కు స్కోప్ ఉండే లేడీ ఓరియెంటెడ్ కథలు ఎంచుకుంటూ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అయితే స్టార్ హీరోల సరసన నటించడం వల్ల కలిగే నష్టాలు ఏంటని తాజాగా ఓపెన్‌గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తను షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సరసన ‘డంకీ’ (Dunki), వరుణ్ ధావన్ సరసన ‘జుడ్వా 2’ లాంటి చిత్రాల్లో నటించింది. అందులో ‘జుడ్వా 2’ పూర్తిగా కమర్షియల్ సినిమా. ఈ సినిమాల్లో నటించడానికి తనకు పెద్దగా రెమ్యునరేషన్ దక్కలేదని షాకింగ్ విషయం బయటపెట్టింది తాప్సీ (Taapsee Pannu).


Also Read: షారుక్ ఖాన్ ఇంటి కరెంట్ బిల్లు తెలిస్తే గుండె గుబేల్.. ప్రతినెల ఎంత పే చేస్తారంటే..?

రెమ్యునరేషన్ తక్కువే

‘‘నేను జుడ్వా, డంకీ లాంటి సినిమాలను డబ్బుల కోసం చేస్తున్నానని ప్రేక్షకులు అనుకుంటారు కానీ నాకు వాటి వల్ల పెద్దగా లాభం ఏమీ ఉండదు. ప్రేక్షకులు అనుకున్నదానికి సరిగ్గా రివర్స్‌లో జరుగుతుంది. నేను లీడ్ రోల్ చేసే సినిమాలకే నాకు ఎక్కువ రెమ్యునరేషన్ లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్‌రుబా. మిగతా సినిమాలకు నాకు అంతగా రెమ్యునరేషన్ దక్కదు. ఎందుకంటే నన్ను అలాంటి సినిమాల్లో సెలక్ట్ చేసి నాకేదో పెద్ద సాయం చేసినట్టు ఫీలవుతారు. సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు. ఇంకెవరో మనకెందుకు అనుకుంటారు. ఇలాంటి వాటిపై నేను రోజూ పోరాడతాను’’ అని చెప్పుకొచ్చింది తాప్సీ.

హీరో మాటే చెల్లుతుంది

‘‘ఈరోజుల్లో తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎవరు నటించాలి అనే విషయాన్ని హీరోలే డిసైడ్ చేస్తారని ఆడియన్స్‌కు కూడా తెలిసిపోయింది. డైరెక్టర్ చాలా సీనియర్ అయ్యిండి, ఆయన ఆడియన్స్ గురించి ఆలోచించేవారు అయితే మాత్రమే హీరోయిన్‌ను ఆయన డిసైడ్ చేయగలుగుతారు. అప్పుడే దర్శకుడి చేతిలో నిర్ణయం ఉంటుంది. కానీ 75 శాతం హీరోయిన్ విషయంలో హీరో మాటే చెల్లుతుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్ ఎవరు, ప్రేక్షకులు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనే విషయాలను గమనించి హీరోయిన్స్‌ను సెలక్ట్ చేసుకుంటారు హీరోలు. కొందరు మాత్రం నన్ను మించిన నటి వద్దని ముందే డిసైడ్ అవుతారు’’ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది తాప్సీ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×