BigTV English

Tamanaih Bhatia : పెళ్లికి ముందే తమన్నా షాకింగ్ నిర్ణయం..?

Tamanaih Bhatia : పెళ్లికి ముందే తమన్నా షాకింగ్ నిర్ణయం..?

Tamanaih Bhatia : తమన్నా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకుంది. అయితే ఈమె పెళ్లిపై గతంలో చాలా వార్తలు వినిపించాయి. కానీ ఆమె ఎప్పుడు ఆ వార్తల పై స్పందించలేదు. ఈ ఏడాది ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కనుందని గత కొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే పెళ్లి కంటే ముందే ఈ బ్యూటీ కొత్త కాపురం పెట్టేందుకు రెడీ అవుతుందని తెలుస్తుంది. అందుకోసం కొత్త ఇంటిని వెతుక్కుంటుందట.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


తమన్నా బాటియా సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేసిందని తెలుస్తుంది. తమిళ్, తెలుగు, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ట్రెండింగ్ లో ఉంది. సినీ కెరియర్ మొదలై చాలా ఏళ్లు అవుతుంది. ఇన్నాళ్లకు పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇప్పటిదాకా పెళ్లి గురించి ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ ప్రేమాయణం గురించి ప్రకటించినప్పటి నుంచి పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఆ మధ్య పెళ్లి గురించి విజయ్ వర్మ కౌంటర్ ఇవ్వడంతో ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వినిపించలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఈ జంట 2025లో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంకేముంది పెళ్లయితే కొత్త కాపురం పెట్టాల్సిందే కదా కానీ వీళ్ళు ముందుగానే వేరే కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మాములుగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ముంబైలోని బాంద్రాలో అదిరిపోయే అపార్ట్మెంట్లు కొనడం చూస్తూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు తమన్నా కూడా కొత్త ఇంటి వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాంద్రాలో తమన్నా, విజయ్ లు ఒక సౌకర్యవంతమైన, విలాసవంతమైన అపార్ట్మెంట్ కోసం సెర్చింగ్ లో ఉన్నారని టాక్. అక్కడ ఇల్లు దొరకగానే అక్కడకు వీరిద్దరు షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది. అక్కడ ముందుగా కాపురం మొదలు పెట్టి తర్వాత అక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమన్నా వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×