BigTV English

Indians In Trump Cabinet: భారతీయులపై ట్రంప్ ఫిదా.. కేబినెట్‌లో ముగ్గురు ఇండియన్ అమెరికన్స్..

Indians In Trump Cabinet: భారతీయులపై ట్రంప్ ఫిదా.. కేబినెట్‌లో ముగ్గురు ఇండియన్ అమెరికన్స్..

Indians In Trump Cabinet| అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 2025లో అధ్యక్ష పదవి చేపటనున్నారు. అయితే ఈ సారి ఆయన తన కేబినెట్‌లో కీలక పదువులకు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. వీరిలో ముగ్గరు ఇండియన్ అమెరికన్స్ (భారత మూలాలున్న అమెరికన్లు)కు కీలక పదవులు కట్టబెట్టడం విశేషం. ఈ ముగ్గురూ కేవలం రాజకీయాల్లో తమ సత్తా చాటడమే కాకుండా తమ హిందూ సంప్రదాయాల గురించి బహిరంగంగా చాటిచెప్పారు.


ట్రంప్ 2.0 కేబినెట్ లో ఇప్పటికే భారత మూలాలున్న ఇద్దరు తులసి గబ్బార్డ్, వివేక్ రామస్వామి ఉండగా.. తాజాగా ట్రంప్ కేబినెట్ లో కాష్ పటేల్ (44) అనే ఇండియన్ అమెరికన్ చేరారు. భారత దేశంలోని గుజరాత్ మూలాలున్న కాష్ పటేల్‌కు ట్రంప్ ఎఫ్‌బిఐ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు. కాష్ పటేల్ పేరుని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు ముందే నవంబర్ 1న ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా ప్రతిపాదించారు. కానీ అందుకు సెనేటర్లు ఆమోదం తెలుపలేదు.

Also Read: కుమారుడికి క్షమాభిక్ష పెట్టిన అధ్యక్షుడు జో బైడెన్.. ట్రంప్ మండిపాటు


కాష్ పటేల్ ముందునుంచి ట్రంప్‌నకు పూర్తి మద్దనిస్తున్నారు. ట్రంప్ ఎజెండా ఏదైనా దాని వెనుక కాష్ పటేల్ కీలక పాత్ర ఉంటుదని రిపబ్లికన్ పార్టీ అందరి నమ్మకం. అందుకే ట్రంప్ డై హార్డ్ ఫ్యాన్స్ లో కాష్ పటేల్ ఒకరు. అమెరికా రాజకీయాలతో పాటు ఇంతకుముందు అయోధ్య రామ మందిరం విషయంలో కూడా కాష్ పటేల్ తాను రామభక్తుడినని.. అందుకోసమే రామ మందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే నని చెప్పేవారు.

అయోధ్య రామమందిరానికి శతాబ్దాల చరిత్ర ఉందని.. ఈ అంశంలో అమెరికా మీడియా ఫోకస్ చేయడం లేదని ఆయన గతంలో విమర్శలు కూడా చేశారు. “మీరు ముస్లిం కావచ్చు, హిందువు కావొచ్చు. అక్కడ హిందూ ప్రధాన దేవతల గుడి ఉండేది. ఆ పురాతన దేవాలయాన్ని 1500 సంవత్సరంలో కూల్చివేశారు. అయితే దాన్ని పునర్నిమించాలని గత 500 ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. కానీ అమెరికన్లు అంత గొప్ప చరిత్రను చాలా సునాయాసంగా పక్కన పెట్టారు.” అని కాష్ పటేల్ ఫిబ్రవరిలో వ్యాఖ్యాలు చేశారు.

కాష్ పటేల్ తో పాటు ట్రంప్ డాక్టర్ జే భట్టాచర్య అనే ఇండియన్ అమెరికన్ ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. కోల్‌కతా కు చెందిన జే భట్టచార్య మాత్రం బహిరంగంగా తాను హిందువుని అని మిగతావారిలా ప్రకటించపోవడం గమనార్హం.

ట్రంప్ కేటినెట్ స్థానం పొందని హిందూ ప్రముఖలలో తులసి గబ్బార్డ్ ముందువరుసలో ఉన్నారు. ఆమె పూర్వీవకులు భారత దేశానికి చెందినవారు కానీ ఏ ప్రాంతానికి చెందినవారో ఆమె తెలుపలేదు. తులసి గబ్బార్డ్ ని ట్రంప్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. దీంతో ఆమె నేతృత్వంలో అమెరికాకు చెందిన 18 నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఇరాక్ యుద్ధ సమయంలో ఆమె భగవద్గీతా తీసుకెళ్లడం. అక్కడ యుద్ధంలో హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు, భజనలు చేసేది.

ఇక వివేక రామస్వామి విషయానికి వస్తే ఆయన ఏకంగా ట్రంప్‌నకు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్టికన్ పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీనిచ్చారు. కానీ ఆ తరువాత ఉపసంహరించుకుని ట్రంప్ నకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తరువాత ఆయనకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీని ఎలన్ మస్క్ తో కలిసి ప్రాతినిధ్యం వహించనున్నారు. వివేక్ రామస్వామి ఎప్పుడూ హిందూ సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి బహిరంగా మాట్లాడుతారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×