BigTV English

Tamanna: క్రేజీ కాంబో.. తమన్నాతో సంపత్ నంది.. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్

Tamanna: క్రేజీ కాంబో.. తమన్నాతో సంపత్ నంది.. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్


Tamanna Odela 2 Movie: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాల హిట్లతో ప్రత్యేక అభిమానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక ఈ దర్శకుడు, హీరో గోపీచంద్ కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. కానీ అవేమీ అంతగా వర్కౌట్ కాలేదు.

దీంతో ఈ దర్శకుడు కొత్తగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కరోనా టైంలో ఓటీటీ వేదికగా ఓ సినిమాను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.


ఇప్పుడు ఆ క్రైమ్ థ్రిల్లర్‌కు దర్శకుడు సంపత్ నంది సీక్వెల్‌ను ప్రకటించాడు. ఈ మేరకు ‘ఓదెల 2’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్‌ మూవీ కాశీలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. దర్శకుడు సంపత్ నంది క్లాప్ కొట్టి షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు.

READ MORE: ఈ రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే.. రాఖీ భాయ్ ఆగయా..

అయితే ఈ సీక్వెల్ మూవీలో ఈ సారి హెబ్బా పటేల్ కాకుండా.. మిల్కి బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. కాగా తమన్నా, సంపత్ నంది రచ్చ సినిమాతో కలిసి ఆ తర్వాత బెంగాల్ టైగర్‌లోనూ వీరి కాంబోని కొనసాగించారు.

అలా వీరిద్దరి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ ఓదెల 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు వీరిద్దరూ చేతులు కలిపారు. ఇకపోతే ఈ మూవీలో ముఖ్యంగా దైవం, భూతం అనే కాన్సెప్ట్‌ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ షూటింగ్‌ను వారణాసిలో మొదలు పెట్టగా.. ఈ కథకు వారణాసికి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంతేకాకుండా ఓదెల 2 సినిమా పోస్టర్‌లోనూ‌ శివుడి తాలుకూ రిఫరెన్సులు కనిపిస్తుండటంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీకి నిర్మాతగా దర్శకుడు సంపత్ నంది వ్యవహరిస్తున్నాడు.

READ MORE: విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా.. వీడియో రిలీజ్ చేస్తూ ఏమన్నాడంటే?

ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు, క్యాస్టింగ్ డీటైల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే సంపత్ నంది ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ఓ మూవీని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ‘గాంజా శంకర్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇటీవల షాక్ తగిలింది.

ఈ చిత్రానికి గాంజా అనే పేరుని తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పేర్లు పెట్టడం ద్వారా యువత చెడిపోయే ప్రమాదం ఉందని భావించి.. ఈ మూవీకి మరోపేరు పెట్టమని పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీకి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సంపత్ నంది ఓదెల 2 మూవీని తెరకెక్కించడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×