Vishal Health Update .. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అటు తన సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా గాయపడుతూ వార్తల్లో నిలుస్తున్న ఈయన.. ఇప్పటికే పలుమార్లు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఇండస్ట్రీలో కూడా విశాల్ ఆరోగ్యం పై ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తాజాగా విశాల్ ఒక కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాల్ స్పృహ తప్పి పడిపోవడం ఏమిటి? ఆయనకు ఏం జరిగింది? అనే కోణంలో అభిమానులు కూడా ఆరాతీస్తున్నారు.
స్పృహ తప్పి పడిపోయిన విశాల్.. మేనేజర్ హరి క్లారిటీ..
అసలు విషయంలోకి వెళితే, 2025న మిస్ కువాగం ట్రాన్స్ జెండర్ బ్యూటీ కాంటెస్ట్ విల్లుపురం వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు విశాల్. మే 11 2025న జరిగిన ఈ కార్యక్రమంలో విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. అయితే ఎందుకు ఇలా సడన్గా విశాల్ స్పృహ తప్పి పడిపోయారు. అని అభిమానుల సైతం కంగారు పడుతుండగా తాజాగా ఈ విషయంపై విశాల్ పర్సనల్ మేనేజర్ హరి(Hari ) అసలు నిజాన్ని బయటపెట్టారు. మేనేజర్ హరి మాట్లాడుతూ.. విశాల్ ఆహారం సరిగ్గా తీసుకోలేదు. మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూసులు మాత్రమే తీసుకున్నారు. దీంతో శక్తి క్షీణించి, స్పృహ తప్పి పడిపోయారు. ఇక వైద్యులు ఆహారాన్ని స్కిప్ చేయవద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అరగంట విశ్రాంతి తీసుకొని మళ్లీ విశాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు” అంటూ హరి తెలిపారు. మొత్తానికైతే ఆహారాన్ని స్కిప్ చేయడం వల్లే ఇలా విశాల్ స్పృహ తప్పి పడిపోయారని, ఆహారం తీసుకోవడం మానేయకూడదని వైద్యులు చెప్పినట్లు హరి స్పష్టం చేశారు.
ALSO READ ; Samantha: సెలబ్రిటీగా ఉండడం అప్పుడు నరకం అనిపించింది..ఆ ఘటనను మరువలేను..!
గతంలో కూడా అనారోగ్యంతో బాధపడిన విశాల్..
ఇకపోతే విశాల్ గతంలో కూడా ఒక ఈవెంట్లో అనారోగ్యంగా కనిపించారు. అక్కడ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైగా స్టేజ్ పై మైక్ పట్టుకుని వణుకుతూ కనిపించి, అందరిలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేశారు. ఇక ఆయనను చూసి అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ సమయంలో విశాల్ తీవ్ర జ్వరంతో ఉన్నాడని, అందువల్లే అలా నీరసంగా వణుకుతూ కనిపించారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇక మొత్తానికైతే విశాల్ ఆరోగ్యం పై ఇలా ఎప్పటికప్పుడు వార్తలు రావడం అభిమానులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి.