Indo-Pak War: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆయన కూతురు ఇప్పుడు ట్రోలింగ్ బారినపడ్డారు. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ గురించి ఆయన చేసిన ప్రకటనపై చాలామంది మండిపడ్డారు. దీనిపై వివరీతంగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల నుంచి ఆయనకు మద్దతు లభించింది.
ట్రోల్స్ గురైన విదేశాంగ కార్యదర్శి
జమ్మూకాశ్మీర్ లోని పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంలో భారత్ సైన్యం ‘ఆపరేషన సిందూర్’ చేపట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థాపరాలపై దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతల పరిస్థితుల గురించి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా ముందుకొచ్చి జరిగిన, జరుగుతున్న పరిస్థితుల గురించి వివరించేవారు.
ఇదే సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఒక్కసారి కాల్పుల విరమణ గురించి ఆయన చేసిన ప్రకటనపై మండిపడ్డారు. ఈ విషయం చాలామంది అతివాదులకు రుచించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ట్రోల్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారి పిచ్చిపిచ్చి రాతలతో విరుచుకుపడతారు. ఆయనపై కూడా అదే చేశారు.
విక్రమ్‌కు బాసటగా నేతలు
అంతేకాదు ఆయన కూతుర్ని సైతం ఈ ఉచ్చులోకి లాగేశారు నెటిజన్స్. రోజురోజుకూ ఈ వ్యవహారం తీవ్రం కావంతో రాజకీయ నేతలు రంగంలోకి దిగేశారు. ఆయనకు తమ మద్దతు పలికారు. విక్రమ్ మిస్రీ ఎంతో నిబద్ధతగల అధికారని అన్నారు. నిజాయతీపరుడు, కష్టపడి పని చేసే దౌత్యవేత్త అని గుర్తు చేశారు. దేశం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక వర్గం ఆదేశాల మేరకు పని చేస్తారని వివరించారు. దేశాన్ని నడిపే ఏ రాజకీయ తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వ ఉద్యోగులను నిందించకూడదని ఎంఐఎం చీఫ్ ఒవైసీ తెలిపారు.
ALSO READ: 100 మంది టెర్రరిస్టులను చంపేశాం, పక్కా ప్లాన్‌తో అటాక్
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే సచిన్ పైలట్ రియాక్ట్ అయ్యారు. విదేశాంగ కార్యదర్శి ఫ్యామిలీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను ఖండించారు. దేశానికి సేవ చేయడానికి అంకితభావంతో పని చేసే ప్రొఫెషనల్ దౌత్యవేత్తలని అన్నారు. వారిని ప్రజలు లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.
విక్రమ్‌మిస్రీ లోతుల్లోకి వెళ్తే..
ఢిల్లీలోని హిందూ కళాశాల, జంషెడ్‌పూర్‌లోని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ పూర్వ విద్యార్థి విక్రమ్ మిస్రీ. కొంతకాలం ప్రకటనల విభాగంలో పని చేశారు. ఆ తర్వాత 1989లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కి ఎంపికయ్యారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో పని చేశారు.
ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో సేవలందించారు. గతేడాది ఆయన విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మే ఏడున ఆపరేషన్ సిందూర్‌తో మీడియా సమావేశం ద్వారా దేశం దృష్టిని ఆకట్టుకున్నారు. చివరకు విక్రమ్ మిస్రీ కూతురు డిడాన్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొందరు వ్యక్తులు. డిడాన్ న్యాయ విద్యార్థి, లండన్‌లో రోహింగ్యా శరణార్థుల కోసం పని చేస్తోంది. దశాబ్దం కిందట తన కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు విక్రమ్.