Sudigali Sudheer.. ఒకప్పుడు మెజీషియన్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ‘బలగం’ వేణు (Venu) సహాయంతో జబర్దస్త్ (Jabardast) లోకి అడుగుపెట్టిన సుధీర్ (Sudheer) అక్కడ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. మొదట స్క్రిప్ట్ రైటర్ గా చేసిన ఈయన.. ఆ తర్వాత కమెడియన్ గా మారి టీం లీడర్ గా సత్తా చాటారు. ముఖ్యంగా తన స్నేహితులు ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad) , గెటప్ శ్రీను (Getup Sreenu) లతో కలిసి పదుల సంఖ్యలో స్కిట్లు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు సుడిగాలి సుధీర్. అంతేకాదు అదే షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి (Rashmi Gautam) తో ప్రేమాయణం నడుపుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే జబర్దస్త్ తోపాటు పలు టీవీ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ కెరియర్ కొనసాగించిన ఈయన.. అటు సినిమా ఇండస్ట్రీలోకి కూడా ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే సినిమాతో కెరీయర్ ను మొదలు పెట్టి.. పలు చిత్రాలు చేసి మెప్పించారు. ఇక త్వరలో ‘గోట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ధనరాజ్ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సుధీర్..
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా బుల్లితెరకు దూరమైన ఈయన అనూహ్యంగా సంక్రాంతి సందర్భంగా ఒక టీవీ షోలో దర్శనమిచ్చి అందరినీ అబ్బురపరిచారు. ఇక ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ఒక షో చేస్తున్నారు సుధీర్. ఈ షోలో తప్ప బయట ఎక్కడ ఆయన కనిపించలేదు. కానీ చాలా కాలం తర్వాత ఒక సినిమా ఈవెంట్ కి వచ్చారు. ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా పేరు దక్కించుకున్న ధనరాజ్ (Dhanraj ) ఇప్పుడు నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామం రాఘవం’. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సముద్రఖని(Samudra khani)కీలక పాత్రలో తండ్రి కొడుకులు ఎమోషన్ తో చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ధనరాజ్. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాదులో ఘనంగా నిర్వహించగా.. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు సుధీర్.
సుధీర్ ఆరోగ్యంపై ఆందోళన పెంచిన ధనరాజ్..
ఈ కార్యక్రమంలోనే సుధీర్ గురించి ధనరాజ్ మాట్లాడుతూ..”గత కొన్ని రోజులుగా సుధీర్ కి హెల్త్ బాగోలేదు. ఇక మూడు రోజులపాటు తనకి మాట్లాడడానికి మాట కూడా రాలేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే.. ఆ వస్తున్నాను అంటూ చెప్పారు. ఆరోగ్యం బాగో లేకపోయినా నాకోసం నేరుగా హాస్పిటల్ నుండి వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకుంటున్న వారిలో సుధీర్ మొదటి వ్యక్తి ..సుధీర్ బయటకు కనిపించినంత కాదు.. చాలా మొహమాటస్తుడు. తన ఫంక్షన్లకు వెళ్లాలన్నా కూడా కాస్త ఆలోచిస్తాడు. అలాంటిది నాకోసం ఏమాత్రం ఆలోచించకుండా.. అందులోనూ ఆరోగ్యం బాగా లేకపోయినా నేరుగా హాస్పిటల్ నుంచి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు. ఇప్పుడు హాస్పిటల్ కి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారు” అంటూ ధనరాజ్ చెప్పడంతో సుధీర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా హాస్పిటల్ లో ఎందుకు ఉన్నారు? అసలు సుధీర్ కి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నారు? అంటూ అభిమానులు వరుస పోస్ట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.