Bigg Boss 8 Telugu Latest Updates: ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో అస్సలు పరిచయం లేని ఇద్దరు కంటెస్టెంట్స్ బాగా కనెక్ట్ అయిపోతారు. అలా అప్పుడప్పుడు వారి మధ్య లవ్ ట్రాక్స్ కూడా మొదలయిపోతాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి రెండు వారాలు అవుతున్నా ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ముందుగా సోనియా, పృథ్విరాజ్, నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందేమో అని ప్రేక్షకులు ఫీలయ్యారు. కానీ ఇప్పుడు నిఖిల్ మనసు మారినట్టుంది లేదా సీతనే తనపై మనసు పారేసుకున్నట్టు అనిపిస్తోంది. మరోవైపు పృథ్వి మాత్రం సోనియాను వదలడానికి ఇష్టపడడం లేదు. దాంతో పాటు యష్మీని కూడా ఇష్టపడడం మొదలుపెట్టాడు.
ఊహించని ట్విస్ట్
బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన కొన్నిరోజులకే సోనియాకు నిఖిల్ కనెక్ట్ అయిపోయాడు. ముందుగా వీరిద్దరి మధ్య అంత కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వకపోయినా.. మెల్లగా ఇద్దరూ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ అయితే సోనియాతో ఎమోషనల్ కనెక్షన్ పెంచేసుకొని తను కాస్త దూరం పెట్టినా తట్టుకోలేకపోయాడు. అది తన గేమ్‌పై కూడా ఎఫెక్ట్ చూపించింది. దీంతో ఫోకస్ తప్పకూడదు అనే ఉద్దేశ్యంతో సోనియాతో మంచిగా ఉంటూనే ఆటల్లోనూ రాణిస్తూ వచ్చాడు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఒకటి ఎదురయ్యింది. అందరితో సరదాగా ఉండే సీత.. నిఖిల్‌పై కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో అని ఆడియన్స్‌లో డౌట్ క్రియేట్ అయ్యేలా చేసింది.
Also Read: సోనియా పోయి.. యష్మి వచ్చే.. బీబీ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్, ఇదేం జంపింగ్‌రా బాబు!
స్పెషల్ ఇంట్రెస్ట్
బిగ్ బాస్ హౌజ్‌లో నిఖిలే పెద్ద ఫ్లర్ట్ అని సీత.. తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తాను అందరు అమ్మాయిలతో ఏమీ ఫ్లర్ట్ చేయలేదని కావాలంటే యష్మీని పిలిచి క్లారిటీ తీసుకోమన్నాడు. యష్మీ మాత్రం నిఖిల్ ఫ్లర్ట్ చేస్తున్నాడని తనకు ఎప్పుడూ అనిపించలేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. విష్ణుప్రియా మాత్రం నిఖిల్ తనతో కూడా ఫ్లర్ట్ చేసినట్టు అనిపించిదని చెప్తూ నవ్వింది. ఈ మొత్తం సంభాషణలో నిఖిల్.. తనతో మాత్రమే స్పెషల్‌గా ఉంటున్నాడని నిరూపించడమే సీత ఉద్దేశ్యం అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. తర్వాత నిఖిల్ మనసులో తనపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించింది సీత. కానీ నిఖిల్ మాత్రం ఫ్రెండ్లీగానే ఉంటున్నాడని సమాధానమిచ్చాడు. ఇదంతా చూస్తుంటే సీతకు నిఖిల్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలయ్యిందేమో అని ఆడియన్స్ అనుమానిస్తున్నారు.
కనెక్ట్ అవుతుందని భయం
తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో పృథ్విరాజ్, సోనియా మధ్య జరిగిన సంభాషణ కూడా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సాగింది. యష్మీ అంటే తనకు ఇష్టమా అని పృథ్విని అడిగింది సోనియా. ‘‘చాలామంది అలా అనుకుంటున్నారు. నువ్వు తన డ్రెస్ బాగుందని చెప్తే తను అలాంటి డ్రెస్సులే వేసుకుంటానని చెప్పిందట కదా’’ అని వివరించింది సోనియా. సోనియా చెప్పినదానికి ఒప్పుకుంటూనే ఒక మనిషిగా యష్మీ అంటే నాకు ఇష్టమని సూటిగా చెప్పేశాడు పృథ్వి. కానీ యష్మీ మామూలుగా ఉంటే కనెక్ట్ అయిపోతుందేమో అని భయపడుతుందని కూడా అన్నాడు. యష్మీతో పృథ్వి ఎలా ఉన్నా సోనియా అంటే మాత్రం తనకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా టాస్క్‌లో గెలిచినందుకు సోనియాకు అందరి ముందు బుగ్గపై ముద్దుపెట్టేశాడు పృథ్వి.