BigTV English

Sai Pallavi : తండేల్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ… చైతుకు మళ్లీ అవమానం తప్పదా?

Sai Pallavi : తండేల్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ… చైతుకు మళ్లీ అవమానం తప్పదా?

Thandel: నాగ చైతన్య సాలిడ్ హిట్ కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. బంగార్రాజు తర్వాత అతనికి మంచి హిట్ సినిమాలు లేవు.. ఈ సారి ఎలాగైనా ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకోవాలని కసిగా ఉన్నాడు. ప్రస్తుతం చైతూ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ రాబోతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించింది. ఇక ప్రమోషన్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సినిమా యూనిట్ ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకుంటామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ మూవీ కోసం చైతూ చాలా కష్ట పడ్డాడు. కానీ పెద్దగా ఫలితం అయితే కనిపించేలా లేదని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. ఎంత కష్టపడిన కూడా ఈ క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే దక్కిందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..


లేడి ఒరియేంటెడ్ మూవీనా..? 

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాలు అంటే ఆమె పాత్రకు ప్రాదాన్యత ఎక్కువగా ఉంటాయి. గతంలో వచ్చిన చాలా సినిమాలు ఆమె పాత్రకు డిమాండ్ ఎక్కువగా ఉంటున్నాయి. విరాటపర్వం మూవీలో రానా సరసన నటించింది. కానీ ఆ మూవీలో సాయి పల్లవికే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి లాంటి పెద్ద సినిమాల్లో నటించిన రానా ఈమె ముందు తెలిపోయాడు. ఇక చైతూ పరిస్థితి ఈ మూవీలో అదే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో నాగ చైతన్యకు పెద్ద స్కోప్ కనిపించలేదు. ఆయన పడవను పాకిస్తాన్ వాళ్ళు లాక్ చేస్తే అక్కడ కాస్త అతను దేశం గొప్పతనం చెబుతూ కనిపిస్తాడని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. మిగతా పార్ట్ మొత్తం సాయి పల్లవి లీడ్ చేస్తుంది. బుజ్జితల్లి పెర్ఫార్మన్స్ ముందు చైతూ డల్ అయ్యినట్లు తెలుస్తుంది. ఒకరకంగా ఇది లేడి ఒరియేంటెడ్ మూవీ అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి రిలీజ్ అయ్యాక చైతూకు బెనిఫిట్ అవుతుందేమో చూడాలి..


నాగచైతన్య కు మళ్లీ నిరాశ తప్పదా..? 

ఈ సినిమా మీద నాగచైతన్య కావాలనే ఇంట్రెస్ట్ చూపించారు. తనకు సూట్ అయ్యే కథ అని నమ్మటమే కాదు ఖచ్చితంగా హిట్ కొడతామని నమ్మకం ఉండడంతో ఆయన అంత సమయాన్ని వెచ్చించినా కూడా రెమ్యునరేషన్ పెంచమని కానీ ఎక్కువ ఇవ్వమని కానీ అడగలేదట. మామూలుగానే ఆయన తీసుకునే పది కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ మూవీలో శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుడి పాత్రలో నటించబోతున్నాడు. తండేల్ రాజు అనే పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఉన్న పది బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలవబోతోందని టీం భావిస్తోంది. అయితే మూవీ హిట్ అయిన చైతూకు పెద్దగా యుజ్ లేదని టాక్.. మరి అదే నిజమైతే అతనికి నిరాశ తప్పదు. ఏది ఏమైనా ఈ ప్రశ్నలకు తెర పడాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×