Brahmamudi serial today Episode: ఒక రౌడీతో కలిసి రాజ్, కావ్యల నుంచి డబ్బులు కొట్టేయడానికి రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఎలా కొట్టేయాలి.. ఎక్కడ తనకు ఇవ్వాలి అనేది వివరంగా చెప్తాడు. ఇంతలో రాజ్ వాళ్లు రావడంతో అదిగో కారు వెళ్తుది. వెళ్లి ఫాలో అవు అంటూ చెప్తాడు. సరేనని రౌడీ కారును ఫాలో అవుతాడు. కారులో వెళ్తున్న రాజ్‌కు వెక్కిళ్లు వస్తుంటాయి. కారులో వాటర్ ఉండదు. ఇంతలో కావ్య, రాజ్‌కు ముద్దు పెడుతుంది. చూశారా..? మీకు వెక్కిళ్లు ఆగిపోయాయి అంటుంది. రాజ్‌కు మళ్లీ వెక్కిళ్లు వస్తాయి. ఇదేమీ సినిమా కాదు. ముద్దు పెట్టగానే.. వెక్కిళ్లు ఆగిపోవడానికి అంటాడు.
రోడ్డు పక్కన కారు ఆపి వాటర్ బాటిల్ కోసం షాపులోకి వెళ్తాడు. వెనకే ఫాలో అవుతున్న రౌడీ మెల్లగా కారు దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి డబ్బులున్న బ్యాగ్ తీసుకుని పారిపోతాడు. కావ్య అరవడంతో షాపులోంచి రాజ్ పరుగెత్తుకు వస్తాడు. ఇద్దరూ కలిసి రౌడీని ఫాలో అవుతుంటారు. రౌడీ రాహుల్ దగ్గరకు వెళ్లి బ్యాగ్ విసిరేసి వెళ్లిపోతాడు. రాహుల్ ఆ బ్యాగ్ తీసుకుని కారులో వేసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో రాజ్, కావ్య వెళ్లి ఆ రౌడీని పట్టుకుంటారు. రాజ్ రౌడీని కొడుతుంటే.. కావ్య వచ్చి ఏవండి ఆగండి అంటూ ముందు మనీ ఉన్న బ్యాగ్ ఎక్కడో అడగండి అంటుంది. ఏవండి ఒక్క నిమిషం ఆగండి.. అంటుంది. ఎందుకు ఏమైంది అని రాజ్ అడుగుతాడు. ఇందాక మీరే అన్నారుగా మన దగ్గర డబ్బు ఉన్న విషయం మనకు తప్పా వేరే ఎవరికీ తెలియదని.. మరి మనం ఇలా డబ్బు తీసుకొస్తున్న విషయం వీడికెలా తెలుసు..? ఇది వీడి పని కాదండి వీడి వెనకే ఎవరో చేయించారు. వాడికి మన గురించి బాగా తెలిసి ఉండాలి.
అని కావ్య చెప్పగానే.. రాజ్ కొడుతూ రేయ్ నీచేత ఈ పని ఎవరు చేయించారో చెప్పు నిన్ను ఇక్కడే వదిలేస్తా.. లేకపోతే నిన్ను కూడా వాడితో పాటు జైలుకు పంపిస్తా. చెప్పరా..? రేయ ఆలోచించుకోవడానకి నీ దగ్గర టైం లేదు.. చెప్తావా..? పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమంటావా..? అంటూ రాజ్ బెదిరిస్తాడు. రౌడీ చెప్తాను సార్ చెప్తాను అంటుంటే.. కావ్య ఆ అనామిక చేయించిందా..? అని అడుగుతుంది. రౌడీ కాదు మేడం మీ ఇంట్లో మనిషే చేయించాడు రాహుల్ అని చెప్తాడు. 20లక్షలు ఇస్తానంటే ఈ పని చేశాను సార్. చెప్తే వదిలేస్తానన్నారు కదా సార్. ఫ్లీజ్ వదిలేయండి సార్.. అనగానే రాజ్ వాణ్ని వదిలేస్తాడు. ఏవండి ఎందుకు వాణ్ని వదిలేశారు అని అడుగుతుంది. రాహుల్ ఈ పని చేశాడని తెలిశాక ఇంక వీడితో ఏం పని ఉంది పద అంటాడు రాజ్. మీరు వెళ్లండి నాకు ఒక చిన్న పని ఉంది అంటుంది కావ్య. ఏంటది.. అని రాజ్ అడగ్గానే.. రాహుల్ ఈ పని చేశాడని తెలియగానే నాకు విషయం మొత్తం అర్థం అయింది. మీరు ఇంటికి వెళ్లి రాహుల్ ను నిలదీసేలోపు నేను చేయాల్సిన పని పూర్తి చేసుకుని వస్తాను అని కావ్య చెప్తుంది.
రాజ్ కోపంగా రాహుల్ అంటూ అరుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. రాహుల్ రాగానే రాజ్ కోపంగా అరేయ్ రాహుల్.. ఇన్నేళ్లు నేను నిన్ను తమ్ముడిగా చూశాను. నువ్వు మాత్రం నన్ను ఇంత మోసం చేస్తావా..? అంటూ కొడతాడు. అందరూ వచ్చి విడిపించినా వదలడు. రుద్రాణి వచ్చి రాజ్‌ను దూరం తోసేసి చంపేస్తావా వాణ్ని అని అడుగుతుంది. దీంతో వీణ్ని ఏం చేసినా పాపం లేదు అంటాడు రాజ్. చంపడానికి వాడు ఏం చేశాడు రాజ్ అని సుభాష్ అడుగుతాడు. దీంతో రాజ్ కోపంగా వీడు నా దగ్గర రెండు కోట్ల రూపాయలు కొట్టేశాడు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రుద్రాణి ఏంటి నా కొడుకు నీ దగ్గర రెండు కోట్లు కొట్టేశాడా..? అని అడుగుతుంది. అందరూ రాహుల్‌ను నిలదీస్తుంటే..రుద్రాణి మాత్రం కోపంగా ఇంతకు ముందే తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని చెప్పాడు.
ఇప్పుడేమో రెండు కోట్లు ఉన్నాయి నా కొడుకు కొట్టేశాడు అంటున్నాడు. అని చెప్పగానే.. అందరూ రాజ్‌ను అనుమానిస్తారు. రుద్రాణి కోపంగా నాకు అప్పు ఇచ్చిన వాళ్లు చంపేస్తామన్నా.. చిల్లిగవ్వ లేదని చెప్పారు. ఒకవేళ వాళ్లు నన్ను చంపేసినా పట్టించుకునేవారు కాదుకదా.. అంటూ నాటకాలు ఆడుతుంటే.. కావ్య ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకుని వచ్చి నిజం చెప్పిస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీతో సహా అందరూ రుద్రాణిని తిడతారు. ఎందుకు ఇలా చేశావని నిలదీస్తారు. దీంతో ఇదంతా నేనే చేశాను కానీ ఎందుకు చేశానో తెలుసా..? వీళ్ల ముసుగులు తీయడానికి ఇదంతా చేశాను. ఇప్పుడే నిరూపిస్తాను అంటూ రెండు కోట్లన్న బ్యాగ్ తీసుకొచ్చి అందరి ముందు పెట్టి.. ఇంట్లో ఖర్చులకు చిల్లర పడేస్తూ.. వీళ్లు మాత్రం కోట్లతో విలాసాలు అనుభవిస్తున్నారు. నాకు కష్టం వచ్చిందని చెప్పినా నన్ను గాలికి వదిలేశారు.
ఈరోజు నన్ను పట్టించుకోలేదు.. రేపు ఇంకొకరిని పట్టించుకోరు.. చెప్పు రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని నిలదీస్తుంది. దీంతో నేన మూడు నెలల టైం అడిగాను కదా..? అంతవరకు ఆగండి ఈ ప్రతి ప్రశ్నకు అప్పుడు సమాధానం చెప్తాను అంటూ వెళ్లిపోతాడు రాజ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?