Thandel Movie Story : అక్కినేని అనేది ఇండస్ట్రీలో పెద్ద కుటుంబమే. కానీ, ఈ పెద్ద కుటుంబం నుంచి పెద్ద సినిమాలు రావడం లేదు. నాగ చైతన్య, అఖిల్ లాంటి వారసులు వచ్చినా… వారి నుంచి సినిమాలు వచ్చినా… అక్కినేని ఫ్యాన్స్‌కి ఏదో లోటు అనేది ఉంటూ వస్తుంది. ఇప్పుడు ఆ లోటును పూడ్చే సినిమా తండేల్ అని అనుకుంటున్నారు. నాగ చైతన్య 16 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. 75 కోట్లతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ… ఏపీలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఉంటుందట. దీని వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్పతనం ఏంటో తెలుస్తుందని అంటున్నారు.
మరి ఆ యదార్థ సంఘటనలు ఏంటి..?
వైఎస్ జగన్ గొప్పతనం ఏం తెలుస్తుంది..?
అనేది ఇప్పుడు చూద్దాం…
నాగ చైతన్య 16 ఏళ్ల కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తండేల్ వస్తుంది. దాదాపు 75 నుంచి 80 కోట్ల బడ్జెట్‌తో అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి దీనికి దర్శకుడు. అయితే ఈ మూవీలో కొన్ని యదార్థ సంఘటనలు ఉన్నాయట.
ఏపీకి తీర ప్రాంతం ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో హైయెస్ట్ తీర రేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానం ఉంటుంది. అయితే… ఏపీ మృత్సకారులు మాత్రం చేపలు వేటకు గుజరాత్ ప్రాంతానికి వెళ్లేవారు. అలా వెళ్లిన సమయంలో మృత్సకారులు వారికి తెలియకుండానే సముద్రంలో బార్డర్ క్రాస్ అయ్యేవారు. దీంతో పాకిస్థాన్ ఆర్మీ ఆ మృత్సకారులను అరెస్ట్ చేసింది.
ఓ సందర్భంలో ఏపీ మృత్సకారులు గుజరాత్ తీర ప్రాంతంలో ఇండియా బోర్డర్ దాటేసి… పాకిస్థాన్ జలభాగంలోకి ప్రవేశించారట. దీంతో పాకిస్థాన్ ఆర్మీ వారిని అరెస్ట్ చేసిందట. వారిని రిలీజ్ చేయించడానికి అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డారట. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో అప్పటి సీఎం వైఎస్ జగన్ మాట్లాడి… వారిని విడిపించారట.
పాక్ ఆర్మీ చెర నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆ మృత్సకారులతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారట. “ఏపీలో ఇన్ని కిలో మీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. ఇక్కడే చేపలు పట్టుకోవచ్చు కదా… “అని అడిగారట. దీనికి వాళ్ల నుంచి వచ్చిన సమాధానం… “ఏపీకి తీర ప్రాంతం ఉంది. కానీ, చేపలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ లేదు. అందువల్లే కోల్డ్ స్టోరేజ్ ఉన్న గుజరాత్ కు వెళ్లి చేపలు పడుతున్నాం” అని చెప్పారట.
దీంతో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 ఫిషింగ్ హార్బర్స్‌ను నిర్మించారట. దీని వల్ల మృత్సకారులు గుజరాత్ తీరానికి వెళ్లడం తగ్గిందని, ఇక పాకిస్థాన్ ఆర్మీ అరెస్టులు పూర్తిగా తగ్గిపోయాయి.
సినిమాలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం గురించి ఉండకపోవచ్చు కానీ, మృత్సకారులు గుజరాత్ తీరానికి వెళ్లడం, అక్కడ పాక్ జల భాగంలోకి వెళ్లడం, అర్మీ అరెస్ట్ చేయడం లాంటివి ఉంటాయని తెలుస్తుంది.
అలాగే… తండేల్ వల్ల ఫిషింగ్ హార్భర్ల ఉపయోగం ఏంటి అనేది కూడా తెలుస్తుందని సమాచారం.