Teja Sajja : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ సినిమా కెరియర్ విషయానికి వస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పాలి. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి సినిమా ఏ స్థాయి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంత మార్కెట్ ఉంటుంది అని ఎవరు ఊహించని టైంలోనే చాలా రిస్క్ చేసి ఒక అడుగు ముందుకు వేశారు ఎస్ ఎస్ రాజమౌళి మరియు ప్రభాస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతంగా వర్కౌట్ అయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది బాహుబలి సినిమా. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలయ్యాయి. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసే ఆడియన్స్ కూడా ఉన్నారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. సుజిత్ దర్శకత్వం వహించిన సాహో, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధే శ్యామ్, ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆది పురుష్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా మంచి సక్సెస్ సాధించి ప్రభాస్ కెరియర్ కి కంబ్యాక్ ఫిలిం అయింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో మొత్తం ప్రభాస్ కెరియర్ లో రెండు వెయ్యి కోట్లు సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇదే విషయాన్ని రానా హోస్ట్ గా చేసే ఒక షోలో చెప్పుకొచ్చాడు యంగ్ హీరో తేజ.
రానా దగ్గుబాటి, తేజ సజ్జా కలిసి రీసెంట్ గా ఒక సినిమా ఈవెంట్ కి హోస్టుగా చేసి నెగిటివిటీ సాధించుకున్నారు. చాలామంది మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులు వీరిద్దరిని సోషల్ మీడియా వేదిక ట్రోల్ కూడా చేశారు. అయితే రానా టాక్ షోలో గెస్ట్ గా హాజరయ్యాడు తేజ. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభాస్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకొచ్చాడు. 1000 కోట్లకు ఒకే ఒక్క మొగుడు ప్రభాస్ అంటూ ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు తేజ. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్ను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టిన ఘనత ప్రభాస్ కు ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు.