Samsung Wicked Music Frame : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్.. తాజాగా మ్యూజిక్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పేస్తూ వికెడ్ మ్యూజిక్ ఫ్రేమ్ పేరుతో బెస్ట్ స్పీకర్స్ ను తీసుకొచ్చేసింది. నచ్చిన ఫోటోను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉన్న ఈ ఫ్రేమ్ లో డిజైన్స్ సైతం ఉన్నాయని తెలిపింది. తాజాగా లాంఛ్ అయిన ఈ స్పీకర్స్ ఇప్పటికే మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం మీ మ్యూజిక్ ప్లేస్ ను మరింత అధునాతనంగా మార్చేసుకోవాలనుకుంటే ఈ స్పీకర్స్ పై ఓ లుక్కేయండి.
మీరు మ్యూజిక్ లవరా? తరచూ మ్యూజిక్ ను వింటూ ఉంటారా? మ్యూజిక్ ను ఆస్వాదిస్తూ మీ రెగ్యులర్ లైఫ్ నడుస్తూ ఉంటుందా? ఇక ఇంకెందుకు ఆలస్యం.. సామ్ సాంగ్ తాజాగా మరో ముందడుగు వేసింది. ప్రత్యేక ఎడిషన్ మ్యూజిక్ ఫ్రేమ్‌ను యూనివర్సల్ పిక్చర్స్‌తో కలిసి లాంఛ్ చేసింది. ఇది వికెడ్ ఫిల్మ్ నుండి మూడు ప్రత్యేకమైన ఆర్ట్ డిజైన్స్ లో వచ్చేసింది.
సామ్ సాంగ్ తీసుకువచ్చేసిన వికెడ్ మ్యూజిక్ ఫ్రేమ్ స్పీకర్ ను ఎంతో ఆకర్షణీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. టాప్ ఫీచర్స్ తో సాంసంగ్ ఈ మ్యూజిక్ ఫ్రేమ్ ను తీసుకొచ్చింది. ఈ వికేడ్ థీమ్ మ్యూజిక్ స్పీకర్ ధర రూ. 23,999గా సామ్ సాంగ్ నిర్ణయించింది. ఇక ఈ స్పీకర్స్ నవంబర్ 24 నుంచి Samsung.com లో అందుబాటులో ఉండనున్నట్టు సైతం తెలిపింది.
ఈ స్పీకర్స్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. హై ఎండ్ వైర్ లెస్ స్పీకర్ ను ఫోటో ఫ్రేమ్ తో అడ్జస్ట్ చేసి తీసుకొచ్చేసింది సామ్ సాంగ్. ఈ వికెడ్ ఫ్రేమ్ లో డిజైన్స్ సైతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక నచ్చిన ఫోటో కార్డ్స్ సైతం అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది.
ఇందులో డాల్పీ అట్మాస్ తో పాటు రెండు ఛానల్స్ 125W ఆడియోతో వచ్చేసాయి. ఇవి క్యూ సింఫనీకి సపోర్ట్ చేస్తాయి. ఇక ఇందులో స్పీకర్ సిస్టమ్ ఇన్బిల్ట్ అయి ఉంది. దీంతో మీ మ్యూజిక్ ప్లేస్ ను మరింత అత్యాధునికంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫ్రేమ్ ఉంచిన గది ధ్వని ఆధారంగా ఆడియో అవుట్‌పుట్‌ను సర్దుబాటు చేస్తుంది. ఇక హై టెక్నాలజీతో వచ్చేసిన ఈ మ్యూజిక్ ఫ్రేమ్ ఆడియో అవుట్ పుట్ అద్భుతంగా ఉంది అని మ్యూజిక్ లవర్స్ ఇప్పటికే చెప్పేస్తున్నారు.
ఇక అలెక్సా, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ తో హోమ్ ఇంటిగ్రేషన్ ను ఈ మ్యూజిక్ ఫ్రేమ్ అందిస్తుంది. ఇక ఇందులో కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వైఫై, ఎయిర్‌ప్లేతో పాటు పలు కనెక్టివిటీలకు ఈ ఫ్రేమ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు మ్యూజిక్ లవర్స్ అయితే వెంటనే ఈ ఫ్రేమ్ ను కొనేయండి. లేదా మీ ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే ఈ ఫ్రేమ్ ను గిఫ్ట్ గా ఇచ్చేసి సర్పైజ్ చేసేయండి.
ALSO READ : ఏటీఎంలో రూ.2.52లక్షలు మాయం… బ్యాంక్ అధికారులకు అంతుచిక్కలే!