Kuberaa Movie: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఏదైనా ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసేటప్పుడు ఆ స్క్రిప్ట్ ఏ హీరోకి అయితే బాగా సూట్ అవుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కథ మొత్తం సిద్ధం చేస్తారు. ఇలా ఎంతో మంది దర్శకులు కొంతమంది హీరోల కోసమే ప్రత్యేకంగా ఇలాంటి కథలను రాస్తారు. అయితే ఆ హీరోలు మాత్రం కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం లేదా, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసి ఇప్పటికి కూడా బాధపడుతున్న వారు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రిజెక్ట్ చేసి డిజాస్టర్ సినిమాల నుంచి తప్పించుకున్న వారు ఉన్నారు.
తాజాగా ఇలాంటి కోవకే నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)చెందుతారని చెప్పాలి. విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో ఏ సినిమా ద్వారా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈయన అర్జున్ రెడ్డి (Arjun Reddy)సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న కింగ్ డమ్ (King Dom)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
బెగ్గర్ పాత్రని వద్దనుకున్నాడా…
ఇదిలా ఉండగా తాజాగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్(Danush) హీరోగా నటించిన కుబేర (Kuberaa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో మొదటగా నటించాల్సిన హీరో విజయ్ దేవరకొండ అని తెలుస్తుంది. శేఖర్ కమ్ములకు విజయ్ దేవరకొండతో ఉన్న మంచి అనుబంధం తోనే మొదటగా తన వద్దకు వెళ్లి ఈ కథ వివరించారట అయితే ఈ సినిమాలో హీరో ఒక బెగ్గర్(Begger) పాత్రలో నటించాల్సి రావడంతో విజయ్ దేవరకొండ తాను అలా చేయలేనని చెప్పి ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేయడంతోనే శేఖర్ కమ్ముల ధనుష్ ను సంప్రదించారంటూ వార్తలు వస్తున్నాయి. మరి విజయ్ దేవరకొండ సినిమా రిజెక్ట్ చేయడం ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
హిట్ కొట్టిన ధనుష్..
ఇక ఈ సినిమా విజయ్ రిజెక్ట్ చేశారని తెలియడంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా రిజెక్ట్ చేసి తప్పు చేశారని, చేసి ఉంటే కచ్చితంగా మరో సక్సెస్ అందుకునేవారని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించడంతో విజయ్ దేవరకొండ హీరోగా చేసి ఉంటే మరో లెవెల్ హిట్ అందుకునేది అంటూ వీరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కారణమేదైనా విజయ్ ఈ సినిమా రిజెక్ట్ చేయడం వల్లే ధనుష్ మంచి సక్సెస్ అందుకున్నారని విజయ అభిమానులు తెగ ఫీలవుతున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించాల్సి ఉంది.
Also Read: ట్వింకిల్ టోట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన సుమ.. వారి కల నెరవేరనుందా?