OTT Movie : ఓటీటీలో సినిమాలను చూడాలనుకున్నప్పుడు, మలయాళం సినిమాలపై ఓ కన్నేస్తున్నారు ప్రేక్షకులు. అంతలా ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ స్టోరీ ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. చివరి వరకూ ట్విస్టులు, టర్న్ లతో ఈ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా స్టోరీ జీనా జార్జ్ (నిరంజన అనూప్), షీలా (సుమా దేవి) అనే మహిళల చుట్టూ తిరుగుతుంది. జీనా ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే మోడ్రెన్ మహిళ. అయితే షీలా ఒక ద్వీపంలో ఒంటరిగా జీవించే మహిళ. ఈ రెండు పాత్రల జీవితాలు వేర్వేరు సామాజిక స్థాయిలో ఉన్నప్పటికీ, వీళ్ళ జీవితాలు ఒకే విధంగా నడుస్తుంటాయి. జీనా జార్జ్ ఒక రాత్రి తన అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన సెంథిల్ అనే దొంగను ఎదుర్కొంటుంది. సెంథిల్ మృదుస్వభావి కావడంతో, అతనితో పరిచయం పెంచుకుంటుంది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా అతన్ని ఇంట్లోనే దాచిపెడుతుంది. అతని వల్ల ఆమె జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది. మరోవైపు షీలా ఒక ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఎల్ధో అనే ఒక వ్యక్తిని రక్షిస్తుంది.
షీలా జీవితంలో కఠినమైన సమస్యలను ఎదుర్కుంటుంది. డబ్బు గర్వం ఉండే జకీర్ వంటి వ్యక్తులతో ఆమె సమస్యల్లో చిక్కుకుంటుంది. ఎల్ధో ఆమె జీవితంలోకి ప్రవేశించడంతో తన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఈ కథలో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన పాత్రలను కలుపుతుంది. ఈ దర్యాప్తులో జీనా, షీలాలు గతంలో దాచిన చీకటి రహస్యాలు బయట పడతాయి. చివరికి ఈ మహిళలు గతంలో దాచిన రహస్యాలు ఏమిటి ? హత్య ఎవరుచేశారు ? ఇన్వెస్టిగేషన్ లో బయట పడే సెక్రెట్స్ ఏమిటి ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : లవర్‌తో పనయ్యాక చంపేస్తాడు… పోలీసులకే చమటలు పట్టించే అబ్బాయి కథ ఇది
సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో
ఈ ఎమోషనల్ థ్రిల్లర్ మలయాళం మూవీ పేరు ‘ది సీక్రెట్ ఆఫ్ విమెన్’ (The Secret of Women). 2025లో విడుదలైన ఈ సినిమాకు ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో నిరంజన అనూప్, అజు వర్గీస్, శ్రీకాంత్ మురళి, మిధున్ వేణుగోపాల్, సుమా దేవి, అధీష్ దామోదరన్, జాకీర్ మనోలి వంటి నటులు నటించారు.ఈ సినిమా రెండు వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన, ఇద్దరు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి రావడంతో స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ 2025 జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.