BigTV English

Same Gender Marriage : ఆ దేశంలో సేమ్ జెండర్ పెళ్లిళ్లకు అనుమతి.. తొలిరోజే బారులు తీరిన ట్రాన్స్‌జెండర్లు

Same Gender Marriage : ఆ దేశంలో సేమ్ జెండర్ పెళ్లిళ్లకు అనుమతి.. తొలిరోజే బారులు తీరిన ట్రాన్స్‌జెండర్లు

Thailand Same Gender Marriage | ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు తమ హక్కులను గుర్తించాలంటూ నిరసనలు, పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఒక దేశంలో ఈ రోజు (జనవరి 23, గురువారం) నుంచి సేమ్ జెండర్ కపుల్స్ పెళ్లి చేసుకునేందుకు అనుమతించే చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో వందలాది LGBTQ+ ( వివిధ స్వలింగ సంపర్కులు) జంటల వివాహాలు జరిగాయి. ఈ క్షణం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించామని వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఆసియా ఖండంలోని థాయ్ ల్యాండ్ దేశంలో జరిగింది.


ముఖ్యంగా ఒక సెలబ్రిటీ స్వలింగ సంపర్కుల జంట పెళ్లి గురువారం ఉదయం అట్టహాసంగా జరిగింది. థాయల్యాంగ్ పురుష సినీనటులు అయిన అపివాట్ “పోర్ష్” అపివాత్సయ్రీ(49), సప్పన్యో “ఆర్మ్” పనాట్‌కూల్ (38), రాజధాని బ్యాంకాక్ నగరంలో పింక్ సూట్స్ ధరించి క్రిస్టియన్ సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు వేలమంది అతిథులు విచ్చేశారు. ఆ తరువాత ఈ సెలిబ్రిటీ గే దంపతులు బ్యాంకాక్ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి తమ మ్యారేజ్ సర్టిఫికేట్లు పొందారు. వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా.. అందుకు చట్టప్రకారం అనుమతి లభించలేదు.. కానీ ఈ రోజు నుంచి కొత్త చట్టం అమలులోకి రావడంతో తమ ప్రేమ విజయం సాధించిందని చెబుతూ.. ‘ఆర్మ్’ కన్నీరు పెట్టుకున్నాడు.

అలాగే థాయల్యాండ్ సీనియర్ నటీమణులు సుమలీ సుడ్సేనెట్ (64), థానాఫోన్ చోఖోంగ్‌సంగ్ (59) కూడా చట్టం అమలులోకి వచ్చిన మొదటి రోజు ఉదయాన్నే పెళ్లి చేసుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇద్దరు లెస్బియన్ ప్రేమికులు వైట్ గౌను ధరించి వివాహం చేసుకున్నారు. పదేళ్లుగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నా.. వివాహంతో తమ బంధం మరింత బలోపేతం అయిందని 59 ఏళ్ల థానాపోన్ చెప్పారు.


Also Read: టిండర్ యాప్‌లో స్వలింగ సంపర్కుల డేటింగ్.. కిడ్నాప్ చేసి దోపిడి

థాయల్యాండ్ రాజు 2024లో సేమ్ జెండర్ ప్రేమికులు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకువచ్చారు. ఈ చట్ట ప్రకారం.. స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కుని కల్పించారు. అంతేకాదు.. వారికి సాధారణ భార్య భర్తల లాగా పిల్లలు దత్తత తీసుకోవడం, వారికి ఆరోగ్య బీమా, న్యాయపరంగా స్త్రీ, పురుషులతో సమానత్వం వంటి అధికారలుంటాయి. అయితే ఈ స్వలింగ సంపర్కుల దంపతులకు భార్య, భర్త అనే పదాలకు బదులు మెన్, వుమెన్ పదాలతో సంబోధించాలి.

థాయల్యాండ్ ప్రధాన మంత్రి, రాజకుమారి అయిన పేటోంగ్టార్న్ షినవత్రా గురువారం ఒక జాతీయం ఛానెల్ లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. “ఈ చట్టంతో థాయల్యాండ్ సమాజంలో మతం, జాతి, లింగం, అనే భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ప్రాప్తిస్తాయి” అని చెప్పారు.

గురువారం ఒక్కరోజే బ్యాంకాక్ లోని సియాం పారాగాన్ షాపింగ్ సెంటర్ లో 200 స్వలింగ సంపర్కుల జంటలు పెళ్లి చేసుకునేందుకు రిజిస్టర్ చేసుకున్నారని బ్యాంకాక్ ప్రైడ్ అనే మీడియా సంస్థ తెలపింది.

అయితే థాయ్ ల్యాండ్ కంటే ముందు నేపాల్, తైవాన్ దేశాల్లో సేమ్ జెండర్ వివాహాలకు చట్టప్రకారం అనుమతి లభించింది.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×