BigTV English
Advertisement

Telugu Movies: హీరోలదే రాజ్యం.. పాపం హీరోయిన్స్.. ఆ విషయంలో తెగ ఫీల్ అవుతున్నారట!

Telugu Movies: హీరోలదే రాజ్యం.. పాపం హీరోయిన్స్.. ఆ విషయంలో తెగ ఫీల్ అవుతున్నారట!

Telugu Movies: టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు హీరోయిన్ అంటే స్టార్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలో నటించేవారు. గతంలో ఒక మూవీలో హీరో, హీరోయిన్స్ కి సమానంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. మెల్లగా హీరోలకి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ హీరోయిన్ పాత్రలకు ఇంపార్టెన్స్ తగ్గించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా కనిపించేటట్లు లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోల పక్కన హీరోయిన్స్ కరువయ్యారని చెప్పొచ్చు. అందం, అభినయం ఉన్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలబడాలంటే అదృష్టం ఉండాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలలో హీరోయిన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ స్క్రీన్ టైమ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. వారు మూవీలో ఉన్నారా అంటే ఉన్నారనే మాటే వినిపిస్తుంది. ఎంత టైం వీరు మూవీలో ఉన్నారు అంటే ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి తయారయింది. తెలుగు ఇండస్ట్రీలో హీరోలదే రాజ్యం అయిపోయింది. పాపం హీరోయిన్స్ ఓ విషయంలో తెగ ఫీల్ అయిపోతున్నారు.. దాని గురించి చూసేద్దాం..


హీరోలదే రాజ్యం.. పాపం హీరోయిన్స్..

జాన్వి సౌత్ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఎదురు చూశారు. అందాల నటి శ్రీదేవి కూతురు కావడంతో ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీతో అడుగు పెడతారా అని అభిమానులు ఎదురు చూస్తారు. దేవర మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్, తంగం పాత్రలో అదిరిపోతుంది అంటూ సినిమాకి ముందు ఫ్యాన్స్ ని ఊదరగొట్టారు. కానీ సినిమా చూసిన తర్వాత జాన్వి సినిమాలో అసలు ఉన్నట్టా లేనట్టా అనే అనుమానం కలుగుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ నిడివి ఎంత తక్కువగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి మాటలే శ్రీనిధి శెట్టి విషయంలోనూ వినిపిస్తున్నాయి. అర్జున్ సర్కార్ గా నాని హిట్-3 తో సక్సెస్ ని అందుకున్నాడు. ఆ మూవీ ప్రమోషన్స్ లో, అర్జున్ సర్కార్ ఒక్క మృదుల మాట మాత్రమే వింటాడు. అది మృదుల పవర్ అంటూ గట్టిగా చెప్పారు శ్రీనిధి. ఇక నాని మేమిద్దరం కలిసి ప్రమోషన్స్ లో ఎక్కువ కనిపిస్తున్నామని ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తాయని అనుకోవద్దు అంటూ నాని ముందే హింట్ ఇచ్చారు. నాని చెప్పినట్లుగానే జరిగింది. శ్రీనిధికి పర్ఫామెన్స్ చూపించడానికి, మూవీలో అసలు స్క్రీన్ టైం పెద్దగా లేదు. ఇప్పుడు ఈ విషయంపైనే నెటిజన్స్ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే రెట్రో విషయంలోనూ ఇదే జరిగింది. పూజా హెగ్డే న్యాచురల్ గా కనిపించినా ఆమె క్యారెక్టర్ గురించి పెద్దగా మాట్లాడుకునే అంత ఏమీ లేదు అన్నది టాక్. కమర్షియల్ సినిమాలలో హీరోయిన్స్ కి ఇంతకుమించి స్క్రీన్ టైం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు అనే వెర్షన్ కూడా వినిపిస్తుంది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తే సినిమాలో వారి రన్ టైం తగ్గాల్సిందేనా అంటే అవును అనే చెప్పాలి. హీరోల పక్కన పెద్ద సినిమాలలో కనిపిస్తే చాలు అని హీరోయిన్స్ అనుకుంటున్నారు. ఏది ఏమైనా కథానాయకుడుకు ఉన్నంత స్క్రీన్ షేర్ మూవీలో హీరోయిన్ కి ఉంటే బాగుంటుంది.


హీరోయిన్ స్క్రీన్ టైమ్ గురించి..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలు గత కొన్ని దశాబ్దాలుగా కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితమయ్యాయి. ఒకప్పుడు సీనియర్ నటుల చిత్రాలలో హీరోయిన్లు కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మూవీలో వారి త్యాగం, భక్తి, కుటుంబ విలువలను సూచించే పాత్రలో కనిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడో అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. లేదంటే లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ ద్వారా వారి నటన ప్రతిభను చూపించాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ సంస్కృతి మారాలని, హీరోయిన్స్ కి ఎక్కువ స్క్రీన్ టైం ఉండే చిత్రాలు రావాలని సిని ప్రియులు కోరుతున్నారు.

Kingdom Movie First Single : కింగ్‌డం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… ‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట ఇది

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×