BigTV English

Kingdom Movie First Single : కింగ్‌డం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… ‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట ఇది

Kingdom Movie First Single : కింగ్‌డం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… ‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట ఇది

Kingdom First Single: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ  బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కింగ్డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా బ్యానర్ పై, నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా మే 30న విడుదల చేయనున్నారు. నిన్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘హృదయం లోపల’ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట..

విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ జంటగా అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వంలో ‘హృదయం లోపల’ అంటూ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటని అనుమిత నాదేసన్, అనిరుద్ కలిసి ఆలపించారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. హృదయం లోపల అంటూ అనిరుద్ రవిచంద్రన్ బ్యూటిఫుల్ మెలోడీస్ ట్యూన్ గా ఈ పాటని కంపోస్ట్ చేయడమే కాక స్వయంగా పాడడం విశేషం. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ స్క్రీన్ పై చేసిన రొమాన్స్, ఈ పాటతో మరో అర్జున్ రెడ్డి ని గుర్తు చేయడం ఖాయం. ఈ పాటలో భాగ్యశ్రీ డాక్టర్ గా, విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా మనకి కనిపిస్తారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ కి తగ్గకుండ వారి కోరుకునే విధంగా ఈ పాటను రూపొందించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది అనిరుద్ ‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


కింగ్‌డం ఫస్ట్ సింగిల్…

ఇక వీడియో సాంగ్స్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంది. వీడియో సాంగ్స్ లో విజయ్, భాగ్యశ్రీ పాత్రల లోతును తెలియజేస్తూ, పాటని రూపొందించారు. విజువల్స్ మూవీలో అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ పాట రిలీజ్ అయిన సందర్భంగా అనిరుద్ కి సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పారు. త్రీ, విఐపి చిత్రాలలో పాటలకు నేను అభిమానిని, నేను హీరో అయిన తర్వాత మీతో కచ్చితంగా పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత నా 13వ సినిమా, మీతో కలిసి చేస్తున్నాను. మన కలయికలో వచ్చిన కింగ్డమ్ మూవీలోని మొదటి పాట రిలీజ్ అవ్వడం, నాకు చాలా సంతోషంగా ఉంది అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా అనిరుద్ కోసం థాంక్స్ నోట్ విడుదల చేశారు. ఈ పోస్టుతో మూవీపై అంచనాలను పెంచేస్తారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

ఇక అనిరుద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో సూపర్ హిట్ పాటలను అందించారు. ఇటీవల విడుదలైన దేవరా సినిమాతో సూపర్ హిట్ మ్యూజిక్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. జైలర్, లియో, ఇండియన్, సినిమాలకు మ్యూజిక్ ని అందించారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఆల్బమ్ ను అందించడం అనిరుద్ స్పెషల్. ఇక ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nani :థియేటర్లలోకి నాని, రామ్ చరణ్ ఒకేసారొచ్చినా ప్రాబ్లం లేదుగా..

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×