OTT Movie : ఓటీటీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారింది. ఇందులో మొదటగా మలయాళం సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. అంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి ఈ మలయాళం మూవీస్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. రీసెంట్ గానే ఓటీటీ లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామా తో తెరకెక్కిన ఈ సినిమా, చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. ఈ మలయాళ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక మధ్యతరగతికి చెందిన జయేష్ కు 38 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే ఇంత వయసు వచ్చినా, అతనికి మాత్రం ఇంకా పెళ్లి కాకుండా ఉంటుంది. దానికి కారణం అతను తన భార్య ఎలా ఉండాలనే దానిపై కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటమే. రూపం, జాతకం, ఇలా కొన్ని షరతుల ఈ కారణంగా, అతను చాలా సంబంధాలను తిరస్కరిస్తాడు. అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, ఇక జయేష్ త్వరగా పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఒక రోజు అతని జాతకం చూసిన ఒక జ్యోతిస్కురాలు, అతని జీవితంలో ఇది చెత్త సమయమని, అతను చాలా అవమానాలు ఎదుర్కుంటాడని చెప్తుంది. ఎందుకంటే అతని జాతకం ప్రకారం 38 ఏళ్ల తర్వాత, అతనికి పెళ్ళి జరిగే యోగం ఉండదని ఉంటుంది. ఈ జోస్యం జయేష్‌ను బాగా కలవరపెడుతుంది. అతను త్వరగా పెళ్లి చేసుకోవడానికి కొంతమంది స్త్రీలను కలుస్తాడు. ఈ క్రమంలో జయేష్ లైంగిక ధోరణి గురించి అతని కుటుంబం, స్నేహితులు అనుమానించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే పెళ్ళి జరక్కపోవడానికి అన్ని రకాలుగా అతనే కారణం అవుతుంటాడు. చివరికి జయేష్ కి పెళ్ళి జరుగుతుందా ? జాతకం ప్రకారం అతని జీవితం అంధకారంలోకి వెళ్తుందా ? అనేది ఈ మలయాళ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఒకరోజు ముందే రెండు ఓటీటీల్లోకి వచ్చిన మోస్ట్ అవైటింగ్ మలయాళ కామెడీ డ్రామా… ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ఒరు జాతి జాతకం’ (Oru Jaathi Jathakam). 2025 లో విడుదలైన ఈ సినిమాకు ఎం. మోహనన్ దర్శకత్వం వహించారు. ఇందులో వినీత్ శ్రీనివాసన్, నిఖిలా విమల్, బాబు ఆంటోనీ, ఇషా తల్వార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ జయేష్ అనే 38 ఏళ్ల యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో, 2025 మార్చి 14 నుంచి అందుబాటులోకి వచ్చింది.