Telugu Producers : సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో భారీగా నష్టపోతున్నామని.. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుండి సినిమా థియేటర్లను బంద్ చేయాలి అంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు కూడా. ఇకపోతే జూన్ 1 నుండి వరుసగా పెద్ద హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu) కూడా జూన్ 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో సినిమా థియేటర్లను బంద్ చేయాలి అనే దుస్సాహసం వెనుక ఆ నలుగురు నిర్మాతలు ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఆ నలుగురిలో నేను లేనంటున్న అల్లు అరవింద్..
అంతేకాదు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఆపివేయడానికి తెర వెనుక ఆ నలుగురు కుట్ర పన్నుతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ వినిపిస్తున్న ఆ నలుగురు అంటే నిర్మాతలు దగ్గుబాటి సురేష్ (Daggubati Suresh), ఏసియన్ నిర్మాణ సంస్థ అధినేత సునీల్ (Suneel), , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు(Dil Raju), గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravindh) అని ఒక గాసిప్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ నాలుగు శక్తులే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఆపాలని కుట్ర చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. నిన్న సాయంత్రం అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో తాను లేను అని చెప్పుకొచ్చారు. ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ..” తెలంగాణలో నాకు ఉన్నది ఒక్క థియేటర్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ సమయం నుంచి అన్ని వదిలేస్తూ వచ్చాను. అక్కడ ప్రస్తుతం 15 థియేటర్లు కూడా లేవు. లీజు గడువు లేకపోతే వాటిని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేయలేదు. 50 ఏళ్లుగా సినిమాలు తీయడమే నా వృత్తి. థియేటర్లకు సంబంధించి మూడు సమావేశాలు జరగగా .. ఆ సమావేశాలకు నేను కానీ మా సహ నిర్మాతలు కానీ ఎవరు వెళ్లలేదు. ఎందుకంటే ఆ థియేటర్ బిజినెస్ నుంచి నేను బయటకి వచ్చేసాను. దయచేసి ఆ నలుగురిలో ఒకరిగా నన్ను చూడకండి ” అంటూ అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
ఆ నలుగురిలో నేను కూడా లేనని చెప్పబోతున్న దిల్ రాజు..
అయితే ఇప్పుడు ఆ నలుగురిలో మిగిలిన ముగ్గురిలో ఒకరు దిల్ రాజు.. ఈరోజు 3:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. దిల్ రాజు ప్రెస్ మీట్ లో తెలుగు రాష్ట్రాలలో 1500 థియేటర్లు ఉంటే.. అందులో నావి కేవలం 25 నుండి 30 వరకు మాత్రమే ఉన్నాయని, ఆయన ఇప్పుడు పెట్టబోయే ప్రెస్మీట్లో చెప్పబోతున్నారు. అంతేకాదు ఆ నలుగురిలో తాను లేనంటూ చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ అన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునిల్ఈ నలుగురే ఆ నలుగురు అంటూ ప్రచారం సాగింది. అందుకే ఇప్పుడు వీళ్లు రెస్పాండ్ అవుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను వీళ్లే శాసించే వాళ్లు.. కానీ ఇప్పుడు తాము కాదంటూ ఎవరికి వారు ప్రెస్ మీట్ లు పెట్టి మరి చెప్పుకొస్తున్నారు.
ఇంతకీ “ఆ నలుగురు” ఎవరు..?
అయితే ఇలా ఎవరికి వారు ఆ నలుగురిలో ఉన్నది నేను కాదు.. నేను కాదు అని చెప్పుకుంటూ పోతే.. మరి థియేటర్లు అన్నీ చేతిలో పెట్టుకొని సినిమాలను కంట్రోల్ చేస్తోంది ఎవరు..? ఇప్పుడు పవన్ సినిమాపై కుట్ర చేసే ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఎవరు..? బడా నిర్మాతలు కూడా తాము కాదు అని చెబుతున్నారంటే మరి వీరిని మించిన నిర్మాతలు ఇంకెవరున్నారు ఇండస్ట్రీలో..? అసలు ఏం జరుగుతోంది..? మీరు కాకుంటే మరి ఎవరు ఆ నలుగురు? అని నెటిజన్స్ కూడా ఆరాతీస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికివారు మేము కాదు అని చెప్పుకుంటూ పోతున్నారే తప్ప.. ప్రధానంగా కుట్ర పన్నుతున్న ఆ నలుగురు ఎవరో మాత్రం ఇంకా బయటకు రాకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.