BigTV English

Star Anchor – AP MLA : కూటమి ఎమ్మెల్యేతో స్టార్ యాంకర్ ప్రేమాయణం…? ఆ పబ్ గొడవతో బయటకి..

Star Anchor – AP MLA : కూటమి ఎమ్మెల్యేతో స్టార్ యాంకర్ ప్రేమాయణం…? ఆ పబ్ గొడవతో బయటకి..

Star Anchor – AP MLA : : సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమలు, ఏఫైర్స్ కామన్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లో కలిసుకోవడం లేదా బయట వాళ్ళో ఎవరొకరితో నచ్చితే రిలేషన్ స్టార్ట్ చేస్తుంటారు. కొందరు పెళ్లి వరకు ఆ ప్రేమను తీసుకొని వెళ్తే.. మరికొందరు మాత్రం నచ్చినన్ని రోజులు కలిసి తిరుగుతారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇక సినీ ఇండస్ట్రీలోని వాళ్ళే కాదు బుల్లితెర స్టార్స్ కూడా ప్రేమ, ఏఫైర్స్ కొనసాగిస్తారు. గతంలో ఎంతో మంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. తాజాగా ఓ స్టార్ యాంకర్ రహస్య ప్రేమ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల హీరోగా టర్న్ అయిన ఈ యాంకర్ ఏకంగా ఎమ్మెల్యేనే లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అంటే మామూలు ఎమ్మెల్యే కాదు.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమికి చెందిన ఎమ్మెల్యేతోనే ఈ యాంకర్ ప్రమాయాణం సాగించారట. ఇంతకీ ఆ యాంకర్ కమ్ హీరో ఎవరు? ఆ కూటమికి చెందిన ఎమ్మెల్యే ఎవరు? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


తెలుగు బుల్లి తెర పై స్టార్డం ఉన్న మేల్ యాంకర్లలో ఈయన ఒకడు. ఈయన హోస్ట్ గా చేసిన ప్రతి షో సూపర్ హిట్ అయ్యాయి. ఆయన చేస్తున్న షోలకు ఫ్యామిలిలోని అందరు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక యూత్ అయితే ఆయన చేసే కామెడీ కోసం పడి చచ్చిపోతారు.

మొదట ఆర్జేగా కెరీర్ స్టార్ట్ చేసి బుల్లితెరపై యాంకర్ ఫిల్డ్‌లోకి అడుగు పెట్టాడు. మొదటి షోతోనే బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్కో షోతో తన క్రేజ్ ను పెంచుకున్నాడు. అలా ఇప్పుడు కొన్ని షోలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆ షోలు మంచి టాక్ ను అందుకున్నాయి. అయితే కేరీర్ పరంగా అబ్బాయి గారు బాగా బిజీ అయ్యారు. హీరోగా కూడా ట్రై చేశాడు. ఇప్పటికే హీరోగా ఓ మూవీ చేయగా, ఇప్పుడు మరో మూవీ రాబోతుంది.


ఇటు యాంకర్‌గా అటు హీరోగా మంచి స్పీడ్ లో ఉన్నా.. ఇతనికి ఎప్పుడు వచ్చే ప్రశ్న పెళ్లి ఎప్పుడు..? నాలుగు పదుల వయసు వచ్చినా… ఈ యాంకర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అని ఇండస్ట్రీ మొత్తం ఎప్పటికప్పుడు కోడై కూస్తుంది

ఎమ్మెల్యేతో ప్రేమాయాణం…?

అయితే ఈ యాంకర్ ప్రేమాయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యేతో ఈ యంకర్ కమ్ హీరో దాదాపు రెండేళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నాడట.

ఇక ఆ ఎమ్మెల్యే విషయానికి వస్తే… ఆ ఎమ్మెల్యే ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. అంతే కాదు, ఆమె అసెంబ్లీకి వెళ్లడం కూడా ఇదే ఫస్ట్ టైం.

పబ్‌లో జరిగిన గొడవతో…

ఇప్పటి వరకు చడిచప్పుడు లేకుండా సాగిన వీరి లవ్ ట్రాక్ బయటపడటానికి ఇటవల పబ్‌లో జరిగిన ఓ గొడవనే కారణమట. పబ్‌లో ఏం జరిగిందంటే…

పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేట్ ఏరియాలో ఓ లగ్జరీ పబ్‌కి ఈ యాంకర్ తన ప్రేయసి అయిన ఎమ్మెల్యేతో వెళ్లారట. అక్కడ ఆ ఎమ్మెల్యే మాజీ లవర్ (ఏపీలో ఓ బడా రాజకీయ వేత్త కొడుకు, ప్రముఖ వ్యాపారవేత్త) మనుషులు ఉన్నారట. అక్కడ వీరి మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగిందట. ఈ సమయంలో ఎమ్మెల్యేకు గాయాలు కూడా అయ్యాయని తెలుస్తుంది.

దీంతో ఈ 10 రోజుల పాటు ఈ యాంకర్‌తోనే ఆ ఎమ్మెల్యే హైదరాబాద్‌లోనే ఉండి… చికిత్స తీసుకుందట. ఇప్పుడు గాయాలు తగ్గడంతో తన నియోజకవర్గం వెళ్లి మళ్లీ ప్రజా సేవ చేసుకుంటుందట.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×