Telugu Movies: తెలుగు ఇండస్ట్రీలో పోలీస్ స్టోరీలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. పోలీస్ కథతో వచ్చే సినిమాలు.. యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ కథకి యాడ్ చేసి రూపొందిస్తారు. ఈ సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తెలుగులో పోలీస్ స్టోరీ సినిమాల గురించి మాట్లాడుకుంటే.. మొదటగా చెప్పుకునేది సాయికుమార్ పోలీస్ స్టోరీ సినిమా గురించే. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చిన ఆ సినిమానే ఎక్కువగా మాట్లాడుకుంటారు. తెలుగులో ఎన్నో సినిమాలు ఈ జానర్ లో వచ్చాయి. కొన్ని సక్సెస్ ని అందుకున్నాయి. కొన్ని ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే జానర్ లో సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు వరుసగా పోలీస్ పాత్రల్లో సినిమాలు తీస్తున్నారు. ఖాఖీ డ్రెస్ తో ఇండస్ట్రీని ఊపెయ్యడానికి హీరోలు రెడీ అయిపోతున్నారు. పోలీస్ కథల నేపథ్యంలో రానున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం..
హిట్ 3..
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాని నటిస్తున్నారు. ఈ సినిమా హిట్ సీక్వెన్స్ లో మూడోది. మొదట వచ్చిన రెండు భాగాలు సక్సెస్ ని అందుకున్నాయి. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
మాస్ జాతర..
ఇక మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతరతో మరోసారి మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు. క్రాక్ తర్వాత పోలీస్ పాత్రలో రవితేజ రానున్నారు. వరుసగా రవితేజ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారే కానీ, ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అవలేదు. ఇప్పుడు మళ్లీ పోలీస్ కథతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమా రవితేజ కి కీలకమని చెప్పొచ్చు. మాస్ మహారాజ్ ఇమేజ్ కి సరిపోయే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమా సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భాను భోగవరపు దర్శకత్వంలో సినిమా రానుంది.
రెబల్ స్టార్..స్పిరిట్..
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ గా నటించలేదు. తొలిసారి ఖాఖీ పాత్ర లో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పోలీస్ డ్రెస్ లో కనిపించనున్నారు ప్రభాస్. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడూ చూడనీ పోలీస్ పాత్రలో ప్రభాస్ ని చూడాలని అభిమానులు ఆత్రుతతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కింగ్ డమ్..
ఇక టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. విజయ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా కింగ్ డమ్. గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. మే 30న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ మొదటిసారి పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి పోలీస్ డ్రెస్ లో దర్శనమిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. అయితే మళ్లీ హిట్ తరహాలో కం బ్యాక్ కి రెడీ అవుతున్నాడు.
ఏది ఏమైనా మరోసారి తెలుగు ఇండస్ట్రీలో ఖాఖీల జాతర మొదలవుతుంది. మరి ఏ హీరో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగ రాస్తాడు వేచి చూడాలి.
Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా.. .