BigTV English
Advertisement

Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా.. .

Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా.. .

Aditi Rao Hydari : బాలీవుడ్ నటి అతిథిరావు హైదరి, సిద్ధార్థ ల గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట గత ఏడాది వివాహం చేసుకున్నారు. 2021లో మహాసముద్రం సినిమా వీరిద్దరిని కలిపింది. అప్పటి నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట ప్రతి ఈవెంట్ లో కలిసి కనిపించారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ ఈవెంట్లకు హాజరవుతుండడంతో వీళ్ళ డేటింగ్ పుకార్లు కాస్త ఊపందుకుంన్నాయి. 2023లో అతిధి తన పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థను యూనికాన్ అని పిలిచి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం నిజమేనని అందరు అనుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో.. మీరెప్పుడు వివాహం చేసుకుంటారా అని అభిమానులు ఎదురు చూశారు. ఇక 2024లో వీరిద్దరూ వివాహం చేసుకొని ఒకటయ్యారు. ఇప్పుడు అతిధి, సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. సిద్ధార్థ గురించి అతిధి ఏం చెప్పిందో చూద్దాం..


నువ్వు నా ప్రపంచం ..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పిలిచే అతిధి, సిద్ధార్థ ఇద్దరు 2024 సెప్టెంబర్ 16 హైదరాబాద్ గుడిలో వివాహం చేసుకున్నారు. సిద్ధార్థ 46వ పుట్టినరోజు సందర్భంగా అతిధి పర్సనల్ యూనికాన్ కోసం హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది. దానితోపాటు కింద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘నువ్వు నా అంతులేని వినోదానికి, నా అంతులేని ఆనందానికి, కారణం. నువ్వే నా ప్రేమ, నా అభిమానివి, ఆటల్లో సహచరుడివి, ప్రయాణాల్లో స్నేహితుడివి, జంతువులతో గుసగుసలాడే వాడివి, నువ్వు నటుడివి, సంగీత నిర్మాతకు గాయకుడవు, డ్యాన్సర్, డాన్సర్వి ఫోటోగ్రాఫర్, ఫుడ్ ఆర్డర్ చేసే కింగ్, వంట వాడివి, నువ్వు జీనియస్, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అన్నీ నీకు శాశ్వతంగా దక్కాలి. అందరికన్నా నువ్వే నా బెస్ట్ అని సిద్దు గురించి ప్రేమతో తన ఇంస్టాగ్రామ్ లో ఇద్దరి ఫోటోతో పోస్ట్ చేసింది అతిధి. ఈ ఫోటో చూసిన వారంతా, సిద్ధార్థ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరిద్దరూ ఇలానే సంతోషంగా ఎప్పుడూ ఉండాలని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది చివరకు భర్తని వంటవాడిని చేసావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


పెద్ద ప్రాజెక్ట్స్ లో ఇద్దరు ..

ఇక సిద్ధార్థ, అతిధి సినిమాల విషయానికి వస్తే.. అతిథి రావు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. పద్మావత్, కాట్రు వెలిడే, సమ్మోహనం, హీరామండి వంటి పెద్ద ప్రాజెక్టులలో ఆమె నటించిన మెప్పించారు. బాయ్స్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సిద్ధార్థ బొమ్మరిల్లు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మిస్ యు, చిత్త, రీసెంట్ గా 2024లో భారీ బడ్జెట్ తో వచ్చిన కమలహాసన్ ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.

Sukumar : సుకుమార్‌ను చూసి సిగ్గుపడ్డ ఐటెం గర్ల్… ఆ ఒక్క ఛాన్స్ ఇస్తాడా అని…

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×