BigTV English

Gaddar Awards Memento: గద్దర్ అవార్డు మొమెంటో చూశారా.. దీని వెనుక అంత అర్థం దాగి ఉందా?

Gaddar Awards Memento: గద్దర్ అవార్డు మొమెంటో చూశారా.. దీని వెనుక అంత అర్థం దాగి ఉందా?

Gaddar Awards Memento..దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు, టెక్నీషియన్లు ఇలా పలువురు సెలబ్రిటీలు కనబరిచిన అత్యుత్తమ ప్రతిభకు గుర్తుగా ఈ గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, ఉత్తమ టెక్నీషియన్స్ పేర్లను జ్యూరీ మెంబర్స్ జయసుధ (Jayasudha), మురళీమోహన్ (Muralimohan ).. ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు (Dilraju) సమక్షంలో మీడియా ముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే.


గద్దర్ అవార్డు మొమొంటోను రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

ఇకపోతే తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఈనెల 14వ తేదీన హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా విజేతలకు ప్రధానం చేసే గద్దర్ అవార్డు మొమొంటోను తాజాగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. అంతేకాదు ఈ తెలంగాణ చలన చిత్రాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా ఈ గద్దర్ మొమెంటోను తయారు చేయించడం గమనార్హం. .


గద్దర్ మొమెంటో.. డిజైన్ వెనుక అసలు కథ..

ఈ గద్దర్ మొమెంటో డిజైన్ చేయడం వెనుక అసలు అర్థం ఏమిటి? దాని రూపురేఖలు ఎలా ఉన్నాయి? అనే విషయానికి వస్తే.. ఫిలిం చేతిని చుట్టుకున్నట్లుగా.. పైకెత్తిన చేతిలో డప్పు నమూనాతో గద్దర్ అవార్డును తీర్చిదిద్దారు. అంతేకాదు ఈ డప్పు పై తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించి, చుట్టూ టీజీఎఫ్ఏ అక్షరాలను కూడా పేర్కొన్నారు. ఇక ఈ మొమెంటో ని ఇలా తయారు చేయడం వెనుక అసలు కథ విషయానికి వస్తే.. “గద్దర్ మనకు ఎప్పుడు ఎక్కడ కనిపించినా చేతిలో డబ్బు పట్టుకొనే కనిపిస్తారు. అదే ఇక్కడ సింబాలిక్ గా చూపిస్తూ అలా మొమెంటో ని రెడీ చేశారు అని పలువురు సినీ సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. అలాగే సినిమాను రీల్ గా , తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ డబ్బుపై ఉన్న లోగోతో చూపించడం జరిగింది. ఇంత విషయాన్ని ఒక్క మొమెంటో రూపంలో చూపించి, వారి ప్రతిభ చతురతను అందరికీ చూపించారు. ఇక ప్రస్తుతం ఈ గద్దర్ మొమెంటో అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది.

గద్దర్ అవార్డ్స్ 2025 విజేతలు వీరే..

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్:

ఉత్తమ మొదటి చిత్రం – కల్కి

ఉత్తమ రెండవ చిత్రం – పొట్టేలు

ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్

జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి విభాగంలో తెరకెక్కిన చలనచిత్రాలలో ఉత్తమ చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా నిలిచింది.

ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు

ఉత్తమ హిస్టారికల్ మూవీ – రజాకార్

ఉత్తమ నూతన దర్శకుడు – శ్రీ యదువంశీ (కమిటీ కుర్రోళ్ళు)

ఉత్తమ ప్రజాధారణ చిత్రం – ఆయ్.. మేం ఫ్రెండ్స్ అండి

ఉత్తమ నటీనటులు..

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2)

ఉత్తమ నటి – నివేతా థామస్ ( 35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు – ఎస్. జే.సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా -2)

ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – అరుణ్ దేవ్ పోతుల, హారిక (35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్)

ALSO READ: Bollywood: స్టార్ కిడ్ కి ఘోర అవమానం.. చచ్చిపోమన్నారంటూ ఆవేదన!

ఉత్తమ టెక్నీషియన్స్..

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : బీమ్స్ సిసిరోలియో (రజాకార్)

ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన – నిజమే నే చెబుతున్న)

ఉత్తమ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ -శ్రేయ ఘోషల్ (పుష్ప2 – సూసేకి అగ్గి రవ్వ మాదిరి)

ఉత్తమ రచయిత – శ్రీ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్ )

ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజు యాదవ్ )

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాథ్ రెడ్డి (గామి )

ఉత్తమ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్ (గామి )

ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య( దేవర- ఆయుధ పూజ )

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – అద్నితిన్ జిహాని చౌదరి (కల్కి 2898 ఏడి )

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టార్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శ్రీను (రజాకర్)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి 2898AD)

స్పెషల్ జ్యూరీ అవార్డు 1 : దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )

స్పెషల్ జ్యూరీ అవార్డు 2: అనన్య నాగళ్ళ (పొట్టేలు )

స్పెషల్ జ్యూరీ అవార్డు 3: సుజిత్ అండ్ సాయి సందీప్ (క )

స్పెషల్ జ్యూరీ అవార్డు 4: ప్రశాంత్ రెడ్డి ,రాజేష్ కల్లేపల్లి (రాజు యాదవ్ )

జ్యూరీ స్పెషల్ మెన్షన్ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2 -స్పెషల్ సాంగ్ )

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×