Tirumala News: తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు ఓపెన్ కావడంతో తిరుమలలో రద్దీ కాస్త తగ్గింది. అయినా దర్శనానికి సమయం పడుతోంది. పరిస్థితి గమనించిన ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుమలకు వెళ్లే భక్తుల కోసం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజ్ కరీంనగర్ టౌన్ నుంచి ఆపరేట్ చేస్తోంది. జూన్ 19 వరకు ఈ టూర్ అందుబాటులో ఉంది.
కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ వివరాలకు వద్దాం. వేర్వేరు ప్రదేశాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. కరీంనగర్ నుంచి ఏపీలో పలు ప్రాంతాలను చూసేందుకు ప్యాకేజీని ప్రకటించింది. ‘TIRUPATI FROM KARIMNAGAR’పేరుతో టూర్ ప్లాన్ చేసింది.
కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి ప్రాంతాలు చుట్టిరానుంది. కరీంనగర్ నుంచి రాత్రి 7.15 గంటలకు రైలు బయలుదేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ నుంచి రాత్రి 8.05 నిమిషాలకు ఉంటుంది. అదే వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు ఆయా స్టేషన్లలో బయలుదేరుతుంది. రాత్రి అంతా జర్నీ కొనసాగనుంది.
మరుసటి రోజు ఉదయం 7.50 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటారు. హోటల్‌లోకి చెకిన్ అవుతారు. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత అక్కడ్నుంచి తిరుచానూరు వెళ్తారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి దర్శనం ఉంటుంది. రాత్రికి తిరుపతిలో రెస్టు చేయనున్నారు. మూడోరోజు తెల్లవారుజామున తిరుమలకు చేరుకుని క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకుంటారు.
ALSO READ: పూరి రథయాత్రకు 365 ప్రత్యేక రైళ్లు, సన్నాహాలు పూర్తి
అదే రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. చివరిగా నాలుగో రోజు తెల్లవారుజామున ఉదయం 3.26 గంటలకు చేరుకుంటారు. ఖమ్మం-4.41 గంటలకు, వరంగల్-5.55 గంటలకు, పెద్దపల్లి-ఉదయం 8.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ముగియనుంది.
ఇక ప్యాకేజీ ధరల విషయానికి వద్దాం. త్రీటైర్ ఏసీ సింగిల్ షేరింగ్‌కు రూ. 14,030ధర ఉండనుంది. డబుల్ షేరింగ్ కు రూ. 10,940 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.9160 ఉండనుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు టికెట్ ధరలు నిర్ణయించారు. స్లీపర్ క్లాస్ అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ.7250, డబుల్ షేరింగ్ కు రూ. 9030, సింగిల్ షేరింగ్ కు రూ. 12120గా నిర్ణయించింది ఐఆర్‌సీటీసీ.
ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ కానున్నాయి. ఏమైనా సమాచారం తెలుసుకోవాలంటే ఆయా 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదింవచ్చు. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లో చూడొచ్చు.