Thaman: టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. చిన్న వయసులోనే, మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ లోకి చేరిపోయారు. ఆయన తెలుగు, తమిళ సినిమాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన, సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. 2003లో వచ్చిన బాయ్స్ సినిమా నుండి నిన్న వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు ప్రతి ఆల్బమ్ లో పాటలు మళ్లీమళ్లీ వినాలనిపించే విధంగా ఉంటాయి. యూత్ కి పూనకాలు తెప్పించే స్పెషల్ సాంగ్స్ చేయడంలో తమన్ తనదైన ముద్ర వేశారు. ప్రతి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ గా ఇస్తూ, ఆ కథకి తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ ని అందించడం తమన్ స్పెషల్. కేవలం సంగీత రంగంలోనే కాకుండా క్రికెట్ లోను తన ప్రతిభను చూపారు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCL లోతను హిట్లర్ టీం కెప్టెన్ గా ఆటను ఆడి క్రికెట్ పై తనకున్న మక్కువ చూపారు. తాజాగా సుమా కనకాల హోస్ట్ గా చేస్తున్న చాట్ షోలో తమన్ గతం లో జరిగిన తన క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు. ఎంపైర్ తో గొడవ గురించి తెలిపాడు.
మాస్ మ్యూజిక్ కాదు మాస్ వార్నింగ్ కూడ ..
సుమ తమన్ తో CCL లీగ్ లో మీరు క్రికెట్ బాగా ఆడారు కదా ఒకవేళ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోయి ఉన్నట్లయితే క్రికెట్ లోకి వెళ్లేవారా, అక్కడ ఎంపైర్ తో మీరు గొడవ ఎందుకు పెట్టుకున్నారు, అని అడగ్గా.. తమన్ నవ్వుతూ ‘అవును అక్కడే ఉండేవాణ్ణి అని, ఆరోజు అశ్విన్ కి హెల్మెట్ పెట్టుకుంటే బాల్ కనపడదు. అప్పుడు హెల్మెట్ లేకుండానే వాడు క్రికెట్ ఆడుతున్నాడు. హెల్మెట్ పెట్టుకుంటే బాల్ కనిపించదన్న విషయం నాకు మాత్రమే తెలుసు. మేము మొదటి సెలెక్ట్ చేసుకునేటప్పుడే, అశ్విన్ బాగా ఆడతాడు అని తీసుకున్నాం. మేం బాల్ కొడితే స్టేడియం బయటికి బాల్ వెళ్లిపోతుంది. మేమిద్దరమే అప్పుడున్న టీంలో బ్యాట్స్మెన్ గా బాగా ఆడేవాళ్ళం. అప్పుడు మా టార్గెట్ కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా ఆవేశంతో మేము రెండు ఓవర్లు ఆడేసాము ఆ తర్వాత ఎంపైర్ వచ్చి మీరు హెల్మెట్ పెట్టుకోకుండా ఆడడానికి వీల్లేదు అని అన్నాడు. ఇప్పటివరకు ఏమీ చెప్పకుండా ఇప్పుడు రెండు ఓవర్ లు అయిన తర్వాత చెప్తున్నారు ఏంటి, నువ్వు స్టేడియం నుంచి బయటికి వెళ్ళావ్ నా కొడకా ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే అని, చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చాను. దీంతో గొడవపడి ఎలాగైనా హెల్మెట్ లేకుండా ఆడాలని చూసాము కానీ ఒప్పుకోకపోవడంతో హెల్మెట్ వేసుకొని ఆడము. ఒక ఓవర్ లోనే 40 పరుగులు తీసి మ్యాచ్ ఆరోజు గెలిచాము’ అని తమన్ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా అప్పుడు గొడవ పడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏదైనా క్రికెట్ మీద మీకున్న ఇష్టానికి మ్యాచ్ గెలిపించాలి అన్న పట్టుదలకి హ్యాట్సాఫ్ అని కామెంట్ చేస్తున్నారు.
రాబోయే సినిమాలు ..
తమన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ, బ్లాక్ బస్టర్ పాటలను ఆడియన్స్ కి అందిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు సంగీతాన్ని అందించారు ఇక ఇప్పుడు ఆయన చేతిలో ప్రభాస్ ‘ది రాజసాబ్’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’OG’ సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంగీత రంగంలో తమన్ ఇంకా మరెన్నో సినిమాలు చేయాలని చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనము కోరుకుందాం.
Good Bad Ugly: అదరగొట్టిన అజిత్.. 200కోట్లు.. బొమ్మ బ్లాక్ బస్టర్