lotus seeds: ఫుల్ మఖానా ఇది అందరికి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించే చాలా మంది దీన్ని తింటున్నారు. వీటిని ఫాక్స్ నట్, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా ఉపవాస సమయంలో అలాగే ఆరోగ్యకరమైన చిరుతిండిగా కూడా మఖానా ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. మఖానా తినడం వల్ల శరీరానికి సహజమైన శక్తి అందుతుంది. దీన్ని మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఎముకలకు పుష్టి
ఎముకల ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. మఖానాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటారు. అటువంటి వారికి మఖానా మంచి ఎంపిక. మఖానాలో మొక్కల నుంచి లభించే ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని కండరాలు తిరిగి తయారవ్వడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. తక్కువగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల తేలికగా బరువు తగ్గాడానికి ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్
శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటే అవకాశం ఉంటుంది. మఖానాలో పొటాషియం మరియు మెగ్నీషియం అధిక మెుత్తంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో సోడియం తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్లజర్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా మఖానాను తినడం వల్ల శరీరంలోని రక్తం, ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ గింజలను తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెపుతున్నారు.
షుగర్ కంట్రోల్
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అంతే కాకుండా దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం మూలంగా ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారు నిరభ్యంతరంగా తినవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తాయి మరియు రక్తపోటును నియంత్రిస్తాయని అంటున్నారు.
Also read:నాన్‌వెజ్ ప్రియులారా.. మటన్ లాగించేస్తున్నారా..! లిమిట్ దాటితే కష్టమే..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మఖానాలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం దీనిలో ఉండే కెయంప్‌ఫెరాల్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా కనిపించేలా చేస్తుంది. చర్మం మెరిసేలా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
మఖానా తీసుకోవడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తే వారు మఖానాను తీసుకోకపోవడం మంచిది. అలాగే డయాబెటిస్ వారు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మఖానాను తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.