Good Bad Ugly Collection : కోలీవుడ్ అగ్ర హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కలిసి నటించిన చిత్రం గుడ్ బాడ్ అగ్లీ. అదిక్ రవిచంద్రన్ సినిమాకి దర్శకత్వం వహించారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అజిత్ సూపర్ పర్ఫామెన్స్ తో యాక్షన్ సీన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సునీల్ అర్జున్ దాస్ యోగి బాబు, ప్రియ వారియర్, కీలక పాత్రలో నటించారు. తెలుగు, తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరింది.. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. ఆ వివరాలు ఇలా..
అజిత్ పవర్ ..
తమిళ్ యాక్టర్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ మన ముందుకు వచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మించారు. సినిమా యాక్షన్ సీన్ లో ఎక్కడా తక్కువ కాకుండా సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్, సాటిలైట్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక సినిమా లాభాల్లోకి రావాలంటే 115 కోట్ల షేర్ రూ. 230 కోట్ల గ్రాస్ సాధించాలని ట్రేడ్ వర్గాల అంచన.
200 కోట్ల క్లబ్ ..
ఈ సినిమా వరల్డ్ వైస్ గా 300 థియేటర్లలో రిలీజ్ చేశారు. అందులో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరిగాయి. ప్రీ సేల్స్ లో రూ. 29 కోట్లు గ్రాస్ ను తమిళనాడులో రూ.17 కోట్లు, టోటల్ ఇండియాలో రూ.20 కోట్లు ఓవర్సీస్ లో రూ.10 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్ ని అందుకుంది. ఈ సినిమా రికార్డ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.
ఇక ఐదవ రోజు అజిత్ నటించిన గుడ్బ్యాడ్ అగ్లీ సినిమాకి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పెరిగాయి. ఆదివారం 4వ రోజు సెలవు రావడంతో ఇండియా వైస్ గా 23.84 కోట్ల వరకు వసూలు సాధించింది. తమిళనాడులో 22 కోట్లు తెలుగులో రూ.1.8 కోట్లనెట్ వసూలు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద అజిత్ పవర్ ని చూపించింది. ఈ సినిమా ఓవర్సీస్ ఇండియా గ్రాస్ మొత్తం కలుపుకొని రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమా ఐదవ రోజు కూడా 15 కోట్ల రాబట్టింది. ఇక ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిందని మూవీ టీమ్ ప్రకటించింది. అజిత్ తన మాస్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడని, బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అయిందని అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.