Thamannaah: ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా (Thamannaah) ఇండస్ట్రీకి వచ్చే దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ అదే క్రేజ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. బహుభాషా కథానాయికగా పేరు దక్కించుకున్న ఈమె టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ముఖ్యంగా సీనియర్ హీరోల సరసన కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్నా, ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తమన్నా ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినా.. ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బాగా పాతుకుపోయింది.
జైలర్ పాటపై తమన్నా అసంతృప్తి..
ఉదాహరణకు రజినీకాంత్ (Rajinikanth ) హీరోగా నటించిన జైలర్ (Jailor) సినిమా కూడా ఒకటి. ఆ సినిమాలో “నువ్వు కావాలయ్యా”. అనే పాట కుర్రకారును ఎంతలా ఆకట్టుకుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ఈ పాట బాగా ట్రెండింగ్ అయింది కూడా. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా హిట్ అవడంలో ఈ పాట కూడా ఒక భాగం అయిందని చెప్పవచ్చు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) సంగీతం అందించగా, రజినీకాంత్ కూడా సహాయ నటుడిగా కనిపించారు. ఇదిలా ఉండగా ఈ పాటలో తమన్నా డ్రస్, ఆమె స్టెప్స్ కి కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆజ్ కీ రాత్ తో సంతృప్తి కలిగింది.
అలాంటి పాటలో తన నటన గురించి తమన్నా స్పందించింది. ఇటీవల సోషల్ మీడియాలో తెలుపుతూ.. జైలర్ చిత్రంలోని పాటలో నేను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాను అనే బాధ ఇప్పటికీ ఉందని స్పష్టం చేశారు. కష్టపడితే ఇంకా కొంచెం బాగా చేయవచ్చుననే ఫీలింగ్ తనకు కూడా కలిగిందని, అయితే తాను కొన్ని నెలల క్రితం నటించిన చిత్రం ‘స్త్రీ2’ చిత్రంలో “ఆజ్ కీ రాత్” అనే పాటలో నటించానని, ఆ పాట తనకు పూర్తి సంతృప్తిని అందించిందని తమన్నా తెలిపింది.
డైరక్టర్ ప్రశంసలు..
ఇకపోతే ఈ పాటలో నటన గురించి ‘స్త్రీ2’ డైరెక్టర్ అమర్ కౌశిక్ (Amar kaushik)కూడా స్పందిస్తూ.. “ఆజ్ కీ రాత్” పాటకు నటి తమన్నా.. ఆ పాత్రగానే మారారని చెప్పారు. అదే చాలు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది తమన్నా. ప్రస్తుతం పలు భాషల్లో అవకాశాలు లేకపోయినా.. హిందీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే రజినీకాంత్ త్వరలో ‘జైలర్ -2’ చిత్రంలో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇందులో కూడా తమన్నా ఐటెం సాంగ్ ఉంటుందేమో చూడాలి. ఇక మరోవైపు తమన్న పెళ్ళికి సిద్ధమవుతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఏడడుగులు వేయబోతోందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. వచ్చే ఏడాది ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమన్నా తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని చెప్పవచ్చు.