Pushpa 2 movie story : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అందుకే పుష్ప 2 సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రాజమౌళి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అందరూ ఊహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్, ఒక పుష్ప అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అంతకంటే ముందు రోజు నుంచి హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ మొదలుకానున్నాయి. ఇక ఈ సినిమా టికెట్ రేట్లు కూడా విపరీతంగా పెంచేసింది చిత్ర యూనిట్. ముంబై వంటి సిటీలో ఏకంగా ఈ సినిమా టికెట్ 3000 రూపాయలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కూడా.
ఇక ఈ సినిమా కథాంశం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే పుష్ప రాజ్ రైజ్ ఎలా ఉండబోతుందో మనం ఇది వరకే చూసాం. ఈ సినిమాలో కూడా ఏ స్థాయిలో ఎదుగుతాడు చూపించనున్నాడు సుకుమార్. ఈ సినిమాలో రావు రమేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే మంత్రిగా ఉన్న రావు రమేష్ ను సీఎం చేయడమే పుష్పరాజ్ లక్ష్యం అంటూ తెలుస్తుంది.
అలానే ఈ సినిమాలో మరో స్ట్రాంగ్ క్యారెక్టర్ జగపతిబాబు. జగపతిబాబును సీఎం చేసే దిశగా షేకావత్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారంట. అయితే ఈ విషయంలో వీరిద్దరి మధ్య ఇగో క్లాసెస్ వస్తూనే ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రధమార్ధం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంతమేరకు నిరాశ కలుగుతుందని, చాలా వరకు ల్యాగ్ సీన్స్ ఉంటాయని విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా అల్లు అర్జున్ అభిమానులు కోరుకునే అంశాలన్నీ కూడా ఈ సినిమాలో సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈవెంట్ లో కూడా సుకుమార్ మాట్లాడుతూ నువ్వు క్లైమాక్స్ కి ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావ్. అంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా దాదాపు మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఫలితం రేపు రాత్రికి తెలియనుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఏ రికార్డ్స్ గురించి మాట్లాడినా కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెబుతూ వచ్చారు. ఈ సినిమాతో బాహుబలిని రికార్డ్స్ విషయంలో మర్చిపోతామా లేదా అనేది ఈ సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంది. సినిమా ఎంత బాగా తీశారు అనేది డిసెంబర్ 5న తెలుస్తుంది. కానీ ఈ సినిమాను జనాల్లోకి మాత్రం విపరీతంగా తీసుకెళ్లారు అని ఖచ్చితంగా చెప్పాలి.
Also Read : Director Buchi Babu Sana: డైరెక్టర్ బుచ్చిబాబు కు భారీ ఎలివేషన్స్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్