BigTV English

Thandel : అయ్యో! ఫ్యాన్స్ లేకుండానే ప్రీ రిలీజ్.. తండేల్ కు అల్లు అర్జున్ ఫియర్!

Thandel : అయ్యో! ఫ్యాన్స్ లేకుండానే ప్రీ రిలీజ్.. తండేల్ కు అల్లు అర్జున్ ఫియర్!
Thandel : నాగచైతన్య – సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం తండేల్. ఈ నెల 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న జరగబోతోందని.. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకాబోతున్నారని చిత్రం బృందం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

‘తండేల్ రాజు కోసం పుష్ప రాజ్’ ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎక్స్ వేదికగా అల్లు అర్జున్, నాగచైతన్య పవర్ఫుల్ లుక్స్ తో పక్కపక్కనే ఉన్న స్టిల్ తో పోస్టర్ ను తండేల్ బృందం పంచుకుంది. నిజానికి 24 గంటల క్రితమే ఈ పోస్టర్ ను ఎక్స్ లో పంచుకోగా… మళ్లీ ఇప్పుడు మరోసారి గుర్తుచేసింది. ఫిబ్రవరి 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు అనౌన్స్ చేసిన టీమ్.. ఎక్కడ జరగబోతోందో క్లారిటీ ఇవ్వలేదు.


పోస్టర్ ఓకే.. ఇప్పుడైనా ఈవెంట్ ఉంటుందా? 

జనవరి 31న ఎక్స్ వేదికగా తండేల్ చిత్ర బృందం ఓ పోస్టర్ ను పంచుకుంటూ తండేల్ రాజు కోసం పుష్పరాజ్ అంటూ పోస్ట్ చేసింది. ఫిబ్రవరి ఫస్ట్ హైదరాబాద్లో గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరగబోతున్నట్టు తెలిపింది. కాగా ఈ రోజు షేర్ చేసిన పోస్ట్ లో ఫిబ్రవరి 2 సాయంత్రం 5గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్టు.. అల్లు అర్జున్ రాబోతున్నట్టు వెల్లడించింది. కానీ ఈ పోస్టర్ లో ఈవెంట్ ఎక్కడ జరగబోతుందో వెల్లడించలేదు.


అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రీ రిలీజ్ 

ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు బెనిఫిట్ షోస్ కు అనుమతి లేదు. దీంతో ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది. సినీ బృందం సమక్షంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్నట్టు సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సంధ్య థియేటర్ ఘటనతో ఎఫెక్ట్ 

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసిలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై సీరియస్ అయినా తెలంగాణ ప్రభుత్వం.. బెనిఫిట్స్ షోస్ తో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ సైతం రద్దు చేసింది. ఇప్పటికీ అల్లు అర్జున్ ఎఫెక్ట్ తగ్గలేదని.. అందుకే తండేల్ సినిమాకు పోలీసుల నుంచి ఫ్రీ రిలీజ్ కు పర్మిషన్స్ దొరకలేదనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఫ్యాన్స్ ను పిలిచి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపటం అసాధ్యమే. అందుకే ఫ్యాన్స్ లేకుండానే ఈవెంట్ ఉండొచ్చనే సినీటాక్ నడుస్తుంది.

ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

పుష్ప 2 సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యాక ఇప్పటివరకు అల్లు అర్జున్ స్టేజ్ పైన కనిపించలేదు. మరి ఇప్పుడు ఈ ఈవెంట్ లో స్టేజ్ పైకి వచ్చి మైక్ పట్టుకుంటే అటెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అసలు అభిమానులే లేకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు చూడాలి.

ALSO READ : బావ మహేష్‌తో విభేదాలు.. ఎట్టేకలకు నోరు విప్పిన నమ్రత చెల్లి

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×