Thandel Trailer Prelude: అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 7 న తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ జనవరి 28 న అనగా రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తండేల్ ప్రీల్యూడ్ ను రిలీజ్ చేశారు. అసలు తండేల్ అంటే ఏమిటి .. ? అని ఎప్పటినుంచో అభిమానుల్లో అనుమానం రేకెత్తుతున్న విషయం తెల్సిందే. దానికి సమాధానం ట్రైలర్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రీల్యూడ్ లో చైతన్య సముద్రంలో చేపలు పట్టడానికి వలలు వేస్తూ కనిపించగా.. వెనుక నుంచి ” ఈ పండగ నుంచి రాజుగాడే మన తండేల్” అని ఒక పెద్దాయన చెప్పే డైలాగ్ ను వినిపించారు. మధ్యలో ఒక షాట్ లో సాయిపల్లవిని చూపించగా.. చివరలో తండేల్ అంటే.. ? అని వెనుక వాయిస్ ఓవర్ వస్తుంది. దానికి సమాధానమే రేపు ట్రైలర్ లో చూడండి అని చెప్పుకొచ్చారు.
Sai Pallavi: సాయిపల్లవి ర్యాగింగ్..ఆమెతో చేయడం కష్టమని చేతులు ఎత్తేసిన డైరెక్టర్
ప్రీల్యూడ్ తో కూడా హైప్ ను క్రియేట్ చేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి తండేల్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ వచ్చింది. అప్పుడే చందూ మొండేటి దానికి క్లారిటీ ఇచ్చాడు. తండేల్ అనేది ఒక గుజరాతీ పదం.. ఆ భాషలో తండేల్ అంటే బోట్ ను నడిపేవాడు అని అర్ధం. ” తండేల్ అంటే బోట్ ఆపరేటర్ అని అర్ధం. ఇప్పుడంటే ఇలాంటి పదాలను వాడడం లేదు కాబట్టి ఎవరికి తెలియదు కానీ, అప్పట్లో అందరూ బోట్ ఆపరేటర్స్ ను తండేల్ అనే పిలిచేవారు. అందుకే ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ పెట్టాం” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా కోసం మొదటి నుంచి చై ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా శ్రీకాకుళం మత్స్య కారులతోనే కొన్ని రోజులు ఉండి.. అక్కడి వాతావరణ పరిస్థితులు.. వారి కష్టాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగానే పాత్రలో జీవించాడు. ఇక తండేల్ రాజు పాత్రలో చై నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. హైలెస్సో.. హైలెస్సా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సైతం ఇదే చెప్పుకొచ్చాడు.
చెప్తే అతిగా ఉంటుంది కానీ.. చై కెరీర్ లోనే బెస్ట్ పెర్మార్మెన్స్ ఇది.. హయ్యెస్ట్ గ్రాసర్ కూడా ఇదే.. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక తండేల్ అనుకున్నప్పటి నుంచి అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ సినిమాపై చాలా అంచనాలను పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే.. కొద్దీ సమయం వేచి చూడాల్సిందే.