Sai Pallavi: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మూవీల హవా ఎక్కువ అవుతుంది. సీనియర్ హీరోలు అని లేదు.. కుర్ర హీరోలు అని లేదు.. అందరూ పాన్ ఇండియా సినిమాలనే అనౌన్స్ చేస్తున్నారు. హిట్ అయ్యిందా సరేసరి.. ప్లాప్ అయితే మరో కథకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాపై దృష్టి సారించని హీరో అక్కినేని నాగచైతన్య. కుర్ర హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ తో దూసుకుపోతుంటే.. చై మాత్రం కొద్దిగా ఆలోచించి ఆచూతూచి అడుగులు వేస్తున్నాడు. ఎట్టకేలకు ఈసారి తండేల్ సినిమాతో పాన్ ఇండియా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు.
కార్తికేయ 2 తో భారీ విజయాన్ని అందుకున్న చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చై సరసన సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 7 న తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నిత్యం ఏదో ఒక అప్డేట్ ను ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రేపు తండేల్ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి డబ్బింగ్ చెప్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయిపల్లవి డైరెక్టర్ చందూ మొండేటిని ర్యాగింగ్ చేస్తున్నట్లు కనిపించింది. ” ఏంటి.. ఇప్పుడు చందూ గారు కూర్చున్నారని రియాక్షన్స్ ఇస్తున్నారా.. ? ఇదో ఒక్కరోజు” అని సాయిపల్లవి అనగానే.. చందూ.. అయ్యో లేదు.. ఒట్టు అని డబ్బింగ్ రూమ్ లోకి వెళ్ళాడు.
Khushi Kapoor: అక్క ముగ్గురు అంటే.. చెల్లి ఇద్దరు అంటుందే.. శ్రీదేవి కూతుళ్లా.. మజాకానా
” నిజం చెప్పాలంటే నేను ఒక పది రోజుల నుంచి డబ్ చేస్తున్నాను. ఒక్క దోమ లేదు.. ఒక కెమెరా లేదు. ఈరోజు ఏంటి కెమెరాలు పెట్టి.. ఇన్నిరోజులు ఫీబేర్ తో.. కోల్డ్ తో చేస్తున్నాను.. ఇప్పటివరకు ఒక్క కెమెరా కూడా నా వైపు తిరగలేదు. ఈరోజు మీరొచ్చారని కెమెరాలు అన్ని నా వైపు తిప్పారు. అబ్బా.. నా లక్ ఈరోజు.. ఆయన వచ్చారు నేను డబ్బింగ్ చేసింది ఎవరో ఒకరు కవర్ చేశారు” అని మాట్లాడింది.
ఇక దీనికి చందూ మొండేటి.. ” ఇది.. ఇలా ఉంటుందండి మా ర్యాగింగ్.. ఇన్నేసి అవార్డులు.. రివార్డులు తీసుకున్నవారితో వర్క్ చేయడం చాలా కష్టం” అని దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయిపోతే ఇది కేవలం ఫన్ కోసమే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితాలను చందూ మొండేటి చాలా రియలిస్టిక్ గా చూపించారని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో చై పాన్ ఇండియా హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.
We sneaked into the dubbing theatre of #Thandel and caught a friendly banter between @Sai_Pallavi92 & @chandoomondeti 😅
The much awaited #ThandelTrailer out TOMORROW! 💥#Thandel all set for a GRAND WORLDWIDE RELEASE ON 7th February ❤🔥#ThandelonFeb7th
Yuvasamrat… pic.twitter.com/XKp0dsMQpe— Geetha Arts (@GeethaArts) January 27, 2025