ICC Year List: భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ – 2024 కి ఎంపికై.. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి పేసర్ గా నిలిచాడు బుమ్రా. 2018 వ సంవత్సరంలో చివరిగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దక్కిన ఈ గౌరవం.. తిరిగి మళ్లీ బుమ్రా రూపంలో భారత్ కి దక్కింది. 2024లో బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Uzbek – Vaishali: ఇదేం బలుపు… భారత ప్లేయర్ కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదా ?
అంతేకాదు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. స్వదేశంలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై భారత్ ఘన విజయం సాధించడంలో, అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టూర్లలో జరిగిన టెస్ట్ సిరీస్ లలో అద్భుతమైన బౌలింగ్ తో రాణించి బుమ్రా శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ బౌలర్ ర్యాంకింగ్స్ లో కూడా బుమ్రా నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
అయితే ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024 దక్కడం పట్ల బుమ్రా స్పందిస్తూ.. ఈ అవార్డు కేవలం తన వ్యక్తిగత ప్రతిభ వల్ల రాలేదని.. తన తోటి క్రికెటర్లు, కోచ్ ల సహకారంతో, అభిమానుల మద్దతు వల్ల ఇది సాధ్యమైందని తెలిపాడు. ఇక ఐసీసీ టి-20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా అర్షదీప్ సింగ్ ఎంపికయ్యాడు. మరోవైపు ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇండియన్ స్టార్ క్రికెటర్ స్మృతి మందాన సొంతం చేసుకుంది.
స్మృతి మందాన రెండోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. గతేడాది స్మృతి మందాన 13 ఇన్నింగ్స్ లలో 57.46 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో 4 సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018లో స్మృతి మందాన ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును అందుకొని.. ఇప్పుడు రెండవసారి ఆ ఘనతను సొంతం చేసుకుంది.
ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా సాధించారు. ఈ అవార్డుకి ఎంపికైన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు అజ్మతుల్లా. 2024 లో తన అద్భుత ఆట తీరుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ 24 ఏళ్ల ఆల్రౌండర్ కి ఈ ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. ఇతడు 14 వన్డేలలో 52.4 సగటుతో 417 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ లో కూడా 20.4 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు.
Also Read: WTC – Pakistan: విండీస్ చేతిలో ఓటమి.. WTC లో అట్టడుగున పాకిస్థాన్ !
# ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 కి ఎంపికైన ప్లేయర్స్:
* మెన్స్ వన్డే క్రికెట్ – అజ్మతుల్లా {ఆఫ్ఘనిస్తాన్}
* మెన్స్ టెస్ట్ క్రికెటర్ – జస్ప్రీత్ బుమ్రా { భారత్}
* మెన్స్ టి-20 క్రికెటర్ – అర్షదీప్ సింగ్ {భారత్}
* మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ – కమిందు మెండీస్ {శ్రీలంక}
* ఉమెన్స్ వన్డే క్రికెటర్ – స్మృతి మందాన {భారత్}
* ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ – డెర్కెన్ { సౌత్ ఆఫ్రికా}
* ఉమెన్స్ టి20 క్రికెటర్ – మెలి కేర్ { న్యూజిలాండ్}
* అంపైర్ – రిచర్డ్ ఇల్లింగ్వర్త్ {యూకే }.
Dominating the bowling charts in 2024, India's spearhead Jasprit Bumrah has been crowned ICC Men’s Test Cricketer of the Year 💥#ICCAwards pic.twitter.com/h8Ppjo2hrv
— ICC (@ICC) January 27, 2025