#Thandel Trailer Trending:అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్ ‘. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం వైజాగ్లో ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తండేల్ ట్రైలర్లో.. అద్భుతమైన ప్రేమ కథతో పాటు భారతదేశం యొక్క విలువలను చూపిస్తూ.. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి మొండేటి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravindh) ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రాజు క్యారెక్టర్ లో నాగచైతన్య, అటు సత్య పాత్రలో సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు అని చెప్పవచ్చు. శ్రీకాకుళంలో మత్స్యకారుల నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ట్రెండింగ్ లో నిలిచిన తండేల్ ట్రైలర్..
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన ట్రైలర్ గా రికార్డ్ సృష్టించింది. విడుదలై 16 గంటలు అవుతున్న నేపథ్యంలో సుమారుగా 160K+లైక్స్ వచ్చినట్లుగా చిత్ర బృందం ఒక పోస్టర్ ను రివీల్ చేసింది. అంతేకాదు అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్ గా తండేల్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది అంటూ పోస్టర్ రివీల్ చేయడంతో.. సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 12 గంటలు ముగిసేసరికి 5.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది. ఇక 10 మిలియన్ వ్యూస్ , 250 K లైక్స్ టార్గెట్ తో ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందని చెప్పవచ్చు. 2 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో దేశభక్తి, ప్రేమ మిళితం చేస్తూ చూపించారు. పైగా ఇందులో ఎమోషన్స్ కి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్లో.. “మా దేశంలో ఉన్న ఊర కుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే, ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోద్ది” అని నాగచైతన్య చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ట్రెండింగ్ లో నిలుస్తూ యూట్యూబ్లో నంబర్వన్ స్థానాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
తండేల్ పై భారీ అంచనాలు ..
ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇక సాయి పల్లవి, నాగచైతన్య మరోసారి జతకట్టారు అని చెప్పవచ్చు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ సినిమా వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ కాంబినేషన్ ను మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.