BigTV English

Anand Vardhan :7 ఏళ్ల తర్వాత మూవీ రిలీజ్.. మంటల్లో కాలిపోయిన హీరో, ఏం జరిగిందంటే?

Anand Vardhan :7 ఏళ్ల తర్వాత మూవీ రిలీజ్.. మంటల్లో కాలిపోయిన హీరో, ఏం జరిగిందంటే?

Anand Vardhan : ఒకప్పుడు ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చిన కొందరు ఇప్పుడు హీరోలు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. మాస్టర్ తేజా లాంటి చైల్డ్ ఆర్టిస్ట్ లు ఎందరో ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరును తెచ్చుకొని ఇప్పుడు హీరోలుగా కూడా స్టార్ ఇమేజ్ ని అందుకొని వరుస సినిమాలు చేస్తున్నారు. కొందరు మాత్రం సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మరో బాలు నటుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అతను ఎవరో కాదు ఆనంద వర్ధన్.. తాను హీరోగా ఏడేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. అదేంటి అప్పటి నుంచి అతను ఒక్క సినిమానే చేస్తున్నాడా? ఏదైనా కారణాల వల్ల సినిమా ఆగిపోయిందా? ఇలాంటి సందేహాలు రావడం కామన్.. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ షూటింగ్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఏంటో వెల్లడించాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.. ఇంతకీ అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..


అప్పటిలో ఏ హీరో కైనా కొడుకుగా, మనమడుగా నటించేది ఆనంద్ వర్ధనే.. ప్రేమించుకుందాం రా.. సినిమాలో వెంకటేష్ అక్క కొడుకుగా నటించిన ఆనంద్.. సూర్యవంశం సినిమాలో కొడుకు, మనవడుగా నటించి మెప్పించాడు. ఇక ఇదే సినిమాను హిందీకిలో అమితాబ్ బచ్చన్ రీమేక్ చేయగా అందులో కూడా ఆనంద్ వర్ధనే బాలనటుడుగా నటించాడు. ప్రియరాగాలు, మనసంతా నువ్వే, పెళ్లి పీటలు, శ్రీ మంజునాథ, మావిడాకులు.. ఇలా దాదాపు పాతిక సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు.. ఇన్నేళ్లకు మళ్లీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఆనంద వర్ధన్ హీరోగా నటిస్తున్న చిత్రం నిదురించు జహాపనా. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏఆర్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ మేదిరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆనంద్ వర్ధన్ సరసన నవమి గాయక్, రోషిని సహోట నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా… ఈ మూవీ షూటింగ్ ఏడేళ్ల క్రితమే మొదలైంది. కానీ ఇప్పటివరకు థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. అందుకు కారణం ఒక పెద్ద ప్రమాదమే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరో ఆనంద్ వర్ధన్ బయటపెట్టాడు.. ఆ ఇంటర్వ్యూ లో సినిమా రిలీజ్ అవ్వడానికి పట్టిందా అని అడగ్గా.. దానికి మాట్లాడుతూ.. ఆ మూవీ షూటింగ్ టైం లో ఓ ప్రమాదం జరిగింది. దీపావళి గురించి హీరోయిన్ కూడా చెప్పే సీన్.. ఆ సీన్ షూట్ చేస్తున్న టైం లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా ఒళ్లంతా కాలిపోయింది. ఇక నేను తట్టుకోలేక పక్కనే ఉన్న సముద్రంలోకి వెళ్లిపోయాను. నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు.. హాస్పిటల్లో ఉన్న మూడు రోజులు నాకు ఏమైందో నాకే తెలియదు మొత్తం జుట్టు అంతా కాలిపోయింది ఒళ్లంతా చర్మం ఊడిపోయింది అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి మళ్లీ నా శరీరాన్ని నేను బిల్డ్ చేసుకొని మళ్లీ సినిమాను పూర్తి చేశాను.. ఆ తర్వాత కరోనా కూడా రావడంతో ఇన్నాళ్లకు థియేటర్లలోకి వచ్చే భాగ్యం కలిగింది. ఈ సినిమా తెలుగు పండగల గురించి చెప్తూ యువతని బాగా ఆకట్టుకుంటుంది కచ్చితంగా అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నామని హీరో ఆనంద్ వర్ధన్ అన్నారు.మొత్తానికి ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..


Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×