Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer ) అద్భుతంగా రాణిస్తున్నాడు తనకు అంది వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు శ్రేయస్ అయ్యర్. గతంలో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ కింగ్స్ జట్టు… శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో దూసుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ పొజిషన్ లోకి వచ్చింది పంజాబ్.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
శ్రేయస్ అయ్యర్ ఇష్టమైన ఫుడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లు అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్… పర్సనల్ లైఫ్ గురించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఇష్టమైన ఫుడ్ గురించి… ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు శ్రేయస్ అయ్యర్. తనకు వడపావ్ అంటే చాలా ఇష్టమని.. తాను నిత్యం దాన్నే తినేవాడిని అంటూ వెల్లడించాడు శ్రేయస్సు అయ్యారు. స్కూల్ వెళ్లేటప్పుడు అలాగే కాలేజీ సమయంలో కూడా వడపావ్ ( Vada pav ) కచ్చితంగా తినే వాడినని స్పష్టం చేశాడు. వడపావ్ ( Vada pav) చాలా టేస్టీగా ఉంటుందని… దాన్ని తినడానికి తాను ఎంతో ఇష్టపడతానని పేర్కొన్నాడు. వడాపావ్ బిజినెస్ పెట్టాలని కూడా ఆలోచన ఉందని వెల్లడించాడు. క్రికెట్ లోకి రాకపోయి ఉంటే.. ఆ వ్యాపారం పెట్టే వాడిని కావచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో శ్రేయస్ అయ్యర్ వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు.. కలిసి వడపావ్ దుకాణం పెట్టుకోండి అని ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు అభిమానులు.
పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ టాప్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు.. అద్భుతంగా రానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో రెండు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్ల్లో కూడా విజయం సాధించింది. ఈ దెబ్బకు నాలుగు పాయింట్లు పంజాబ్ ఖాతాలో చేరిపోయాయి. దీంతో పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్లో విజయం సాధిస్తే… ఆ రెండు మ్యాచ్లలో కూడా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ కోసం చూసుకోకుండా మొదటి మ్యాచ్ లో మ్యాచ్ గెలిచేందుకే ప్రయత్నం చేశాడు. మొదటి వికెట్ కు బరిలోకి దిగి కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. కాగా మొన్నటి మెగా వేలంలో 26.75 కోట్లు పెట్టి.. శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
Also Read:Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">