Chinni : వెండి తెర పై బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించడం కన్నా బుల్లితెరపై సీరియల్స్ చేస్తున్న నటీనటులకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అంతేకాదు.. అయితే ఏడాదికి ఒకటి రెండు వస్తాయి కానీ సీరియల్స్లలో నటించే హీరో హీరోయిన్లు నిత్యం టీవీలలో కనిపిస్తూనే ఉంటారు. అందుకే వాళ్లకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా సీరియల్స్లలో నటిస్తున్న వారికి రెమ్యూనికేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.. సీరియల్స్లలో మెయిన్ రోల్ చేస్తున్న హీరో, హీరోయిన్లకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అన్న విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్స్ లలో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో చిన్ని కూడా ఒకటి.. ఈ సీరియల్ కోసం రోజుకు ఎంత తీసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
చిన్ని సీరియల్ కావేరి రెమ్యూనరేషన్..
స్టార్ మాలో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో చిన్ని సీరియల్ కూడా ఒకటి. బిడ్డ కోసం తల్లి, దండ్రులుగా నటించారు. కావేరి పాత్ర సీరియల్ హైలెట్ అయ్యింది.. చిన్ని డైలీ సీరియల్‌లో కావ్య శ్రేయ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నిఖిల్ మాలిక్కల్ కూడా ఈ సీరియల్‌లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతోంది. ఇది తల్లి సెంటిమెంట్ కథతో నడుస్తుంది. తన బిడ్డను ఎలా కాపాడుకోవాలి అనే స్టోరీ పై సీరియల్ నడుస్తుంది. కావ్య సీరియల్స్ ఎంతగా ఆదరణ పొందుతాయి అన్నది తెలిసిందే.. ఈమధ్య కావ్య రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఆర్ టాపిక్ గా మారింది. ఇంతకీ కావ్య ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందంటే 40 నుంచి 50 వేల వరకు ఉంటుందని సమాచారం.. ఈ లెక్కన నెల 12- 15 లక్షల వరకు ఉంటుంది.. ఇది చిన్న న్యూస్ కాదు.
Also Read :కమెడియన్ భరత్ జీవితంలో విషాదం.. గుండెబరువెక్కే బాధలు..
కావ్య పర్సనల్ లైఫ్ చూస్తే..
గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు నిఖిల్ మళియక్కల్. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగు పెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు. సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన పెడితే నిఖిల్ గోరింటాకు సీరియల్ లో తనతో కలిసి నటించిన కావ్య తో ప్రేమలో ఉన్నాడని అందరికీ తెలుసు. ఈ సీరియల్ తో మీ ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లడం రీల్స్ చేయడం తో అది నిజమే అని జనాలు నమ్మారు. అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారు అన్నది సస్పెన్స్ గానే ఉంది… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ పాల్గొన్నారు.. ఇప్పటికీ తన మనసులో కావ్య ఉందని చెప్పకనే చెప్పేసాడు. మరి వీళ్ళిద్దరూ జీవితంలో కలుస్తారేమో చూడాలి..