BigTV English

Mani Ratnam: మణిరత్నం లవ్ స్టోరీ… లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరో.. ఎవరంటే.!?

Mani Ratnam: మణిరత్నం లవ్ స్టోరీ… లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరో.. ఎవరంటే.!?

Mani Ratnam: సినీ ఇండస్ట్రీ దిగ్గజ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. లవ్ స్టోరీ అంటే మణిరత్నం సినిమానే అనే విధంగా ఉంటాయి. ఆయన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించబడ్డాయి.  ప్రస్తుతం అందరూ దర్శకులు పాన్ ఇండియా సినిమాలు తీయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ రెండు మూడు దశాబ్దాల క్రితమే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మూవీస్ అన్ని భాషల లో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా విజయాన్ని అందుకునేవి. దేశవ్యాప్తంగా పాపులారిటీ, ఉన్న దర్శకుల లో మణిరత్నం మొదటివాడు. ప్రస్తుతం ఆయన 37 ఏళ్ల తర్వాత కమలహాసన్ థగ్‌ లైఫ్ సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మణిరత్నం నెక్స్ట్ పిక్చర్ పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన నెక్స్ట్ పిక్చర్ తెలుగు హీరోతో చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. అసలు ఆ వివరాలు చూద్దాం..


మణిరత్నం లవ్ స్టోరీ… లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరో..

మణిరత్నం భారతీయ సినిమాలోనే తనదైన ముద్రవేశారు. ఆయన ప్రతి చిత్రం ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ప్రస్తుతం కమలహాసన్ హీరోగా థగ్‌ లైఫ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో సింధు, త్రిష, అభిరామి, అశోక్ సల్వన్, ఐశ్వర్య లక్ష్మి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మణిరత్నం తన 235వ సినిమా ప్రకటన కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన తదుపరిచిత్రం ప్రేమ కథగా రూపొందుతుందని అందులో తెలుగు హీరోతో చేయనున్నట్లు సమాచారం. మణిరత్నం లవ్ స్టోరీ అంటే అందరికీ గుర్తొచ్చేది గీతాంజలి. ఆ తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చిన గీతాంజలి మూవీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోయింది. ఇక మణిరత్నం తదుపరి చిత్రం లవ్ స్టోరీ గా రానుందని అందు,లో తెలుగు హీరో కి ఛాన్స్ ఇస్తున్నారని సమాచారంతో ప్రేక్షకుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. తిరిగి ఆయన నాగార్జునతో గానీ, నాగచైతన్యతో గాని మూవీ చేస్తారని టాక్. మణిరత్నం లాంటి దర్శకుడు తో పనిచేయడం ఏ హీరో కైనా అదృష్టంగా భావిస్తారు. మరి అలాంటి దర్శకుడితో అక్కినేని నాగచైతన్య కు అవకాశం వస్తే, అది మరో గీతాంజలి అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు . దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అయన సినిమా అంటేనే క్రేజ్ ..

మణిరత్నం చిత్రాలు ఎప్పుడూ కథనం సంగీతం భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి ఇక ఆయన తదుపరి చిత్రం కూడా అలాంటి అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తెలుగు హీరో ఈ చిత్రంలో చేరితే అది తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. గత చిత్రం పొన్నియిన్ సెల్వన్ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆయన డ్రీం ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకొని మణిరత్నం కు మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది.

Ajith Kumar: అజిత్ 64 మూవీ అప్డేట్స్.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×